Prabhas and Anushka: అనుష్కతో ప్రభాస్ బ్రేకప్.. కారణమిదే!

టాలీవుడ్ అనగానే చాలామందికి ప్రభాస్ (Prabhas), అనుష్క జంట కూడా కచ్చితంగా ప్రస్తావనకు వస్తుంది.

  • Written By:
  • Publish Date - March 1, 2023 / 02:22 PM IST

కేవలం సినిమాలే (Movies) కాకుండా హీరోహీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ, గాసిప్స్, హిట్ పెయిర్స్ లు లాంటివి సైతం ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇక సెలబ్రిటీ ప్రేమ వ్యవహారాలు కూడా ప్రతినిత్యం హాట్ టాపిక్ గా మారుతుంటాయి. అయితే టాలీవుడ్ అనగానే చాలామందికి ప్రభాస్ (Prabhas), అనుష్క జంట కూడా కచ్చితంగా ప్రస్తావనకు వస్తుంది. చాలా సంవత్సరాలు ఈ జంటకు సంబంధించిన పెళ్లి, ప్రేమ వార్తలు చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే.

అయితే నిజానికి ‘బిల్లా’ మూవీ సెట్‌లో ప్రభాస్, అనుష్క (Anushka) ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత చాలా కాలంపాటు రిలేషన్ లో ఉన్నారు. ఒకానొక సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలతో హల్ చల్ చేశాయి. అయితే అనేక ఇంటర్వ్యూలలో ఈ జంట పెళ్లి, రిలేషన్ వార్తలను ఖండించారు. తాము మంచి స్నేహితులమని చెప్పారు. అయితే తాజాగా మరోసారి వీళ్ల ఎపైర్ చర్చకు దారితీస్తోంది. సీనియర్ హీరోతో అనుష్క ఎఫైర్ ఉందనే రూమర్స్ రావడంతో ఇద్దరి మధ్య విభేదాలకు కారణమై ఉండొచ్చునని తెలుస్తోంది.

అనుష్క రిలేషన్ షిప్ గురించి పుకార్లు రావడంతో ప్రభాస్ (Prabhas) ఆమెకు దూరమైనట్లు సమాచారం. ప్రభాస్ తల్లి అనుష్కపై పలు కారాణాలతో కోడలిగా కోరుకోవడం లేదని తెలుస్తోంది. ఈ పుకార్లు టాలీవుడ్ అంతటా వ్యాపించాయి. ప్రభాస్, అనుష్కల విభేదాలు ఎప్పటికైనా పరిష్కారమవుతాయా, వారి ప్రేమకథ సుఖాంతం అవుతుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా, రూమర్స్ వ్యాప్తిచెందినా అనుష్క, ప్రభాస్ (Prabhas) ఫ్రెండ్లీగా ఉండటం చాలా సందర్భాల్లో కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ జంట పెళ్లి (Marriage) చేసుకుంటారా? లేదా? అనే విషయం పట్ల అభిమానులు చాలా ఉత్సాహంతో ఉన్నారు.

Also Read: Amala Akkineni: మనం కుక్కలను ప్రేమిస్తే అవి మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాయి!