Site icon HashtagU Telugu

Prabhas Anushka : కన్నప్ప ప్లాన్ అదిరింది.. ప్రభాస్ తో పాటు అనుష్క కూడా..!

Prabhas Anushka In Manchu Vishnu Kannappa

Prabhas Anushka In Manchu Vishnu Kannappa

Prabhas Anushka మంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కన్నప్ప. మంచు విష్ణు కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సర్ ప్రైజ్ రోల్ లో కనిపిస్తారని తెలిసిందే. కన్నప్ప సినిమాలో ప్రభాస్ లార్డ్ శివ పాత్రలో కొద్దిసేపు అలరిస్తారని తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో శివుడిగా ప్రభాస్ నటిస్తే పార్వతిగా ఎవరు చేస్తారా అన్న కన్ ఫ్యూజన్ కొన్నాళుగా నడుస్తుంది. లేటెస్ట్ గా ఆ కన్ ఫ్యూజన్ కు తెర దించేలా క్రేజీ అప్డేట్ త్వరలో ఇవ్వబోతున్నారట. ముందు ప్రభాస్ పక్కన పార్వతి పాత్రలో బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ని తీసుకోవాలని అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రభాస్ కి జోడీగా అనుష్కని రంగంలోకి దించుతున్నారట.

ప్రభాస్ అనుష్క జోడీకి ఉన్న క్రేజ్ తెలిసిందే. అందులోనూ శివ పార్వతులుగా అంటే అది ఊహించుకుంటేనే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇద్దరు కలిసి బాహుబలి 2 లో చివరగా నటించారు. మళ్లీ ఇద్దరు కలిసి నటించే రోజు కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ తన సోలో సినిమాలతో ఫుల్ బిజీగా ఉండగా అనుష్క ఆచి తూచి సినిమాలు చేస్తుంది.

మంచు విష్ణు కన్నప్పలో ప్రభాస్ అనుష్క కలిసి నటిస్తే మాత్రం ఆ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. కన్నప్ప సినిమాలో కన్నడ నటుడు శివ రాజ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్ లాల్ ఇలా చాలామంది నటీనటులు ఉంటున్నట్టు తెలుస్తుంది. దసరా బరిలో వచ్చేందుకు సిద్ధంగా ఉన్న కన్నప్ప సినిమాపై రోజుకొక అప్డేట్ సినిమాపై భారీ హైప్ తెస్తుంది.

Also Read : Akhil : లుక్స్ ఓకే కానీ అనౌన్స్ మెంట్ ఎప్పుడు రాజా..?