Radhe Shyam: గాసిప్స్ కు చెక్.. ‘రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ లాక్!

తెలుగు సినిమా ప్రేక్షుకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ ఒకటి. అందులో హీరో ప్రభాస్ కావడం, ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కించడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

  • Written By:
  • Updated On - February 2, 2022 / 01:10 PM IST

తెలుగు సినిమా ప్రేక్షుకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ ఒకటి. అందులో హీరో ప్రభాస్ కావడం, ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కించడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని భావించిన ప్రేక్షకులకు కరోనా కారణంగా వెనక్కి తగ్గాలి వచ్చింది. చివరకు అనేక వాయిదాల తమ సినిమా తేదీని ఫైనల్ చేశారు. తమ చిత్రం ‘రాధే శ్యామ్’ థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుందని, వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంతో నటీనటులు ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాను మార్చి 11, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. “ఆకర్షించే ప్రేమకథకు కొత్త విడుదల తేదీ! #రాధేశ్యామ్ మార్చి 11న సినిమాల్లోకి!” అంటూ హీరోయిన్ పూజాహెగ్డే స్పందించింది.

దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తన సినిమాను ‘థియేటర్లలో మాత్రమే’ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన వారంలోపే ఈ ప్రకటన వచ్చింది. కోవిడ్ మహమ్మారి కారణంగా అనేక వాయిదాల తర్వాత ఓటీటీ లో రిలీజ్ కోసం మేకర్స్ థియేట్రికల్ విడుదలను నిలిపివేస్తారనే పుకార్లు వ్యాపించాయి. అయితే, దర్శకుడు తన ట్వీట్‌తో పుకార్లకు చెక్ పెట్టారు. విడుదలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో సినిమా విడుదలలో అయోమయం నెలకొంది. డిసెంబరులో COVID-19 కేసుల పెరుగుదల కారణంగా మరో రెండు పెద్ద చిత్రాలైన షాహిద్ కపూర్ నటించిన ‘జెర్సీ’ SS రాజమౌళి  ‘RRR’ కూడా విడుదల తేదీలను వాయిదా వేసిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది.

ఇక ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులే పని చేశారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు ‘రాధేశ్యామ్’ మూవీ కోసం అత్యద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సినిమా కోసం రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ‘రాధేశ్యామ్’ సినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించగా…. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ ను చాలా గ్రాండియర్ గా ప్రజెంట్ చేశారు. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేయగా…. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలివనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మొత్తంమీద ‘రాధేశ్యామ్’ మార్చి 11న వరల్డ్ వైడ్ గా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.