Site icon HashtagU Telugu

Kalki 2898 AD : కల్కి షూటింగ్ అప్డేట్.. రెండో పార్ట్‌కి కనెక్ట్ చేసే సీన్స్‌ని..

Prabhas Amitabh Bachchan Kamal Haasan Kalki 2898 Ad Shooting Update

Prabhas Amitabh Bachchan Kamal Haasan Kalki 2898 Ad Shooting Update

Kalki 2898 AD : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీ ‘కల్కి 2898 AD’. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. హిందూ పురాణాల్లోని కొన్ని పాత్రలను సూపర్ హీరోలుగా చూపిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మల్టీ పార్ట్స్ గా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అది రెండు భాగాలుగా రాబోతోందా, మూడు భాగాలుగా రాబోతోందా.. అనేది తెలియాల్సి ఉంది.

కాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యిపోయిందని ఇటీవల చిత్ర యూనిట్ ఓ పోస్ట్ వేసిన సంగతి తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ మాత్రం.. ఇంకా షూటింగ్ జరుపుతూ వస్తుంది. రీసెంట్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ బర్త్ డేని షూటింగ్ సెట్స్ లోనే గ్రాండ్ గా నిర్వహించారు. షూటింగ్ పూర్తి అయ్యిపోయిందని చెప్పి.. మళ్ళీ ఏం చిత్రీకరిస్తున్నారని అభిమానుల్లో సందేహం నెలకుంది. అయితే మేకర్స్ ప్రస్తుతం షూట్ చేస్తుంది సెకండ్ పార్ట్ కి సంబంధించిన సీన్స్ అని సమాచారం.

బాహుబలి, సలార్ సినిమాల పార్ట్ 1ని.. సెకండ్ పార్ట్ సీన్స్ తో ఎండ్ చేసి ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కల్కి 1కి కూడా అలాగే ఎండ్ కార్డు వేయడం కోసం మేకర్స్ ప్లాన్ చేశారట. ఈక్రమంలోనే సెకండ్ పార్ట్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారట. కాగా ఈ మూవీని మే 9న రిలీజ్ చేస్తామంటూ నిర్మాతలు అనౌన్స్ చేసారు. కానీ ఎలక్షన్స్ వల్ల రిలీజ్ వాయిదా పడింది.

అయితే ఆ వాయిదాని ఎక్కువ లేటు చేయకుండా మే నెలాఖరులోనే సినిమా తీసుకు వచ్చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇంకో వార్త కూడా ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. ఈ సినిమాని జులైలో రిలీజ్ చేయనున్నారని చెబుతున్నారు. మరి వీటిలో ఏది నిజమో తెలియాలంటే వేచి చూడాలి.