Prabhas – Allu Arjun : రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంచి స్నేహితులు అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ ఇద్దరు పాన్ ఇండియా హీరోలుగా మారక మునుపు ఒకరి మూవీ ఈవెంట్స్ కి ఒకరు అటెండ్ అయ్యి సందడి చేసేవారు. ఆ సమయంలో స్టేజి పై ఈ ఇద్దరు స్నేహితులు చేసే సరదా అల్లరి తమ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకునేది. అయితే ఇటీవల కాలంలో ఈ ఇద్దరు అసలు కలుసుకున్న సందర్భాలే లేవు.
ఎవరు కెరీర్ లో వారు బిజీ అయ్యిపోయి ఒకరిని ఒకరు కలుసుకోవడం మానేశారు. అయితే ఈ ఇద్దరి ఫ్రెండ్స్ ని ఇప్పుడు ఒక ఈవెంట్ కలపబోతుందట. టాలీవుడ్ లో ఈసారి డైరెక్టర్స్ డే ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్, ప్రభాస్ డొనేషన్స్ కూడా ఇచ్చారు. మే 19న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ ఈవెంట్ భారీ స్థాయిలో గ్రాండ్ గా జరగబోతుందట. ఇక ఈ ఈవెంట్ లో టాలీవుడ్ లోని దర్శకులు, నిర్మాతలతో పాటు పలువురు హీరోలు కూడా పాల్గొనున్నారట.
ఈక్రమంలోనే ప్రభాస్, అల్లు అర్జున్ కూడా పాల్గొనున్నారట. వీరిద్దరూ ఈ ఈవెంట్ కి రావడం కన్ఫార్మ్ అయ్యిందట. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం వర్గాల్లో హల్ చల్ చేస్తుండడంతో.. ఇది విన్న ప్రభాస్, బన్నీ అభిమానులు తెగ సంబర పడుతున్నారు. చాలా ఏళ్ళ తరువాత ప్రభాస్, అల్లు అర్జున్ మళ్ళీ ఒక వేదిక పై కనిపించడం ఒక విశేషం అయితే.. వీరిద్దరూ ప్రస్తుతం ఇండియన్ ఫేవరెట్ పాన్ ఇండియా స్టార్స్ కావడం మరో విశేషం.
మరి చాలా కాలం తరువాత ఒకే వేదిక పై కలుసుకోబోతున్న అల్లు అర్జున్, ప్రభాస్.. స్టేజి పై ఈసారి ఏం చేయనున్నారో చూడాలి. అలాగే ఈ ఈవెంట్ కి ఇంకెవరెవరు స్టార్ హీరోలు రాబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది.