Adipurush : ‘ఆదిపురుష్’కి క్లీన్ U సెన్సార్ సర్టిఫికెట్.. వామ్మో రన్ టైం మరీ అంతా?

తాజాగా సెన్సార్ బోర్డు నుండి క్లీన్ U సర్టిఫికేట్ ఆదిపురుష్ సినిమాకు లభించింది. ఇక ఈ సినిమా రన్ టైం ఏకంగా

Published By: HashtagU Telugu Desk
Adipurush

Prabhas Adipurush Movie gets clean U Certificate and run time locked

ఓం రౌత్(Om Raut) దర్శకత్వం వహించిన ఆదిపురుష్(Adipurush) సినిమా జూన్ 16, 2023న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్(Krithi Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా కనిపించనున్నారు. రామాయణం(Ramayanam) ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపుల్ మీడియా సంస్థ ఏకంగా 170 కోట్లకు తెలుగు రైట్స్ తీసుకొని విడుదల చేయనున్నారు.

ఆదిపురుష్‌ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఇప్పటికే పాజిటివ్ మౌత్ టాక్ ఉంది. తాజాగా సెన్సార్ బోర్డు నుండి క్లీన్ U సర్టిఫికేట్ ఆదిపురుష్ సినిమాకు లభించింది. ఇక ఈ సినిమా రన్ టైం ఏకంగా 179 నిమిషాలు. అంటే 3 గంటలు. ఇటీవల కాలంలో మూడు గంటల సినిమా రావట్లేదు. కానీ రామాయణం చెప్పడానికి మూడు గంటలు కూడా చాలదు. ముఖ్యంగా రామాయణంలోని అరణ్యకాండ, యుద్ధ కాండ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.

ఇప్పటి టెక్నాలజీతో అత్యధిక VFX లతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజయిన ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ హైప్ వచ్చింది . ఇక ఇటీవల ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా గ్రాండ్ గా సక్సెస్ అయింది. సినిమాకు మరింత హైప్ తీసుకురావడానికి పలువురు సినీ ప్రముఖులు కూడా ముందుకొస్తున్నారు. రణబీర్ కపూర్ 10 వేలమంది పేద పిల్లలకు ఫ్రీగా ఆదిపురుష్ సినిమా చూపించనున్నారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా 10 వేల మంది అనాధలకు, వృద్ధాశ్రమంలోని వారికి ఆదిపురుష్ సినిమా ఫ్రీగా చూపించనున్నారు. ప్రతి థియేటర్లో ఆంజనేయస్వామి కోసం ఒక సీటు ఉంచుతామని చిత్రయూనిట్ పేర్కొంది. ప్రభాస్ అభిమానులతో పాటు దేశమంతటా ప్రేక్షకులు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

 

Also Read ; Aishwarya Rai Bachchan : ఐశ్వర్య రాయ్ తెలుగులో డైరెక్ట్‌గా నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా..?

  Last Updated: 08 Jun 2023, 08:09 PM IST