Site icon HashtagU Telugu

Prabhas : ప్రభాస్ 7 సినిమాల లైనప్.. రచ్చ రంబోలా..!

Devara Villain for Prabhas Spirit Sandeep Vanga

Devara Villain for Prabhas Spirit Sandeep Vanga

రెబల్ స్టార్ (Rebal Star) ప్రభాస్ కల్కి తర్వాత రాజా సాబ్ షూటింగ్ లో ఉన్నాడు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత ఒకటి రెండు కాదు ఏకంగా ఆరేడు సినిమాలు లైన్ లో పెట్టాడు ప్రభాస్. రాజా సాబ్ షూటింగ్ దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాతో ప్రభాస్ థ్రిల్లర్ జోనర్ ని టచ్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

రాజా సాబ్ (Rajasaab) తో పాటుగా హను రాఘవపుడి డైరెక్షన్ లో ఫౌజి సినిమా సెట్స్ మీద ఉంది. ఐతే ప్రభాస్ ఇంకా ఆ సినిమా షూటింగ్ లో జాయిన్ కాలేదు. సందీప్ వంగాతో స్పిరిట్ కూడా ఉంది. ఈ రెండితో పాటు కల్కి 2 (Kalki 2), సలార్ 2 ఉన్నాయి. ప్రభాస్ (Prabhas) తో సినిమా కోసం ప్రశాంత్ వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా ప్రభాస్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. ఇలా ప్రభాస్ దాదాపు వరుసగా 7 సినిమాలను లైన్ లో పెట్టాడు. సో ప్రభాస్ తో సినిమా అంటే కొత్త వారికి కష్టమే అని చెప్పారు. ఈ 7 సినిమాలు ఎలా లేదన్నా ఈ 10 ఏళ్లు టైం పట్టేలా ఉన్నాయి.

ప్రభాస్ వరుస సినిమాలతో ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ అందించనున్నాడు. రాజా సాబ్ సినిమా ఏప్రిల్ 10, 2025 న రిలీజ్ ఫిక్స్ చేశారు.

Also Read : Mokshagna NTR : మోక్షజ్ఞ, ఎన్టీఆర్.. ఫైట్ తప్పదా..?