Puneeth Rajkumar : పునీత్ బాధ్యత నేను తీసుకుంటానన్న స్టార్ హీరో

కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో ఆయన అభిమానులు, సినీ యాక్టర్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Published By: HashtagU Telugu Desk

కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో ఆయన అభిమానులు, సినీ యాక్టర్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పునీత్ ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగమైన విషయం అందరికీ తెలిసిందే.

పునీత్ తనకి సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులను ప్రజలకు ఖర్చు చేయాలని పదుల సంఖ్యలో వృద్ధాశ్రమాలు, అనాధ ఆశ్రమాలు, గోశాలలు నడుపుతున్నారు. వీటిల్లో వేలాది మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇక పునీత్ 1800 విద్యార్థులను చదివిస్తున్నారు. పునీత్ మరణంతో వీళ్ళందరూ అనాధలయిపోతున్న పరిస్థితి నెలకొంది.పునీత్ బాధ్యతను తాను తీసుకుంటానని హీరో విశాల్ ముందుకొచ్చారు. పునీత్ చదివిస్తున్న 1800 మంది విద్యార్థులను చదివించే బాధ్యత తనదేనని విశాల్ ప్రకటించారు. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు దాచుకున్నానని, ఇల్లు తర్వాతనైనా కట్టుకోవచ్చు కానీ పునీత్ మొదలుపెట్టిన మంచి పని ఆగిపోకూడదని విశాల్ అన్నారు.

  Last Updated: 03 Nov 2021, 11:59 PM IST