Site icon HashtagU Telugu

Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేసిన పోలీసులు.. అనంతపురంకి తరలింపు.. వీడియో వైరల్!

Posani Krishna Murali

Posani Krishna Murali

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ ప్రముఖ నటుడు కమెడియన్ పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పోసాని ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన శైలిలో కామెడీ చేస్తూ కమెడియన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు సినిమాలలో నటీస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తున్నారు పోసాని.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా రాజకీయ అంశాలపై వార్తల్లో నిలుస్తున్నారు. కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ లేని పోనీ కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే గత కొంత కాలం నుంచి పోసాని కృష్ణమురళి రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. వైసీపీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన పార్టీ ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్‌ చేసారు.

పోసాని కృష్ణ మురళిని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ లోని పోసాని కృష్ణ మురళి నివాసానికి వెళ్లిన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి పోసానిని ఏపీకి తరలిస్తున్నారు. పోసానిని అనంతపురం కి తరలిస్తున్నారు. పోసాని కృష్ణమురళి పై ఓబుల వారిపల్లి పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. పోసానిపై సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కులాల పేరుతో దూషించడం ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసాని పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.