Site icon HashtagU Telugu

Comedian Raju Srivastava : ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ఇక లేరు..!!

Raju Srivastav

Raju Srivastav

ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ గుండెపోటుతో మరణించారు. ఆగస్టు 10న గుండెపోటు రావడంతో ఆయన్ను ఎయిమ్స్ లో చేర్చారు.42 రోజుల పాటు కోమాలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం మరణించారు.  ఆయన వయస్సు 58 సంవత్సరాలు. వ్యాయామం చేస్తుండగా గుండె పోటు రావడంతో ఆసుపత్రిలో చేరారు.  రాజు శ్రీవాస్తవ 1963 డిసెంబర్ 25న యూపీలోని కాన్పూర్ లో జన్మించారు. రాజుకు చిన్నప్పటి నుంచి మిమిక్రీ, కామెడీ అంటే చాలా ఇష్టం. దిగ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్ అనే కామెడీ షో ద్వారా రాజుకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ షో సక్సెస్ తర్వాత రాజు తన కెరీర్ లో వెనక్కి చూడలేదు.

రాజు శ్రీవాస్తవ 2014లో కాన్పూర్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాజ్ వాది పార్టీ నుంచి టికెట్ పొందినప్పటికీ పోటీ చేసేందుకు నిరాకరించాడు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ స్వచ్చ భారత్ అభియాన్ లో నామినేట్ అయ్యారు. పలు నగరాల్లో పరిశుభ్రతపై నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఫిట్ నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే రాజు శ్రీవాస్తవ…వ్యాయామానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను నవ్విస్తుంటారు. ఇన్ స్టాలో ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అయ్యాయి. రాజుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజు శ్రీవాస్తవ హఠాన్మరణతో ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.