Poonam Kaur : పూనమ్ కీలక ట్వీట్స్..కూటమి విజయం పైనేనా..?

'కుట్రపూరితంగా, మోసం చేసి గెలవడం కంటే.. ఒక యోధుడిగా ఓడిపోవడమే మేలు' అంటూ పూనమ్‌ చేసిన కామెంట్‌

Published By: HashtagU Telugu Desk
Poonam Sri Bharath

Poonam Sri Bharath

పూనమ్ కౌర్ (Poonam Kaur) ఈ పేరును కొత్తగా పరిచయం చేయవల్సిన అవసరం లేదు. సినిమాల ద్వారా అమ్మడు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు కానీ..పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , త్రివిక్రమ్ (Trivikram) ల ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. నిజంగా వారి వల్ల ఈమె ఎంత నష్టపోయిందో తెలియదు కానీ..బయట మాత్రం పూనమ్ కౌర్ కెరియర్ ను వీరిద్దరే నాశనం చేసారని మాత్రం ఓ వర్గం ప్రచారం చేస్తుంటుంది. ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా పూనమ్ సైతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లపై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేయడం , విమర్శలు , ఆరోపణలు చేయడం చేస్తుంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా పూనమ్‌ కౌర్‌ చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘కుట్రపూరితంగా, మోసం చేసి గెలవడం కంటే.. ఒక యోధుడిగా ఓడిపోవడమే మేలు’ అంటూ పూనమ్‌ చేసిన కామెంట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈవీఎంలను ట్యాంపర్‌, హ్యాక్‌ చేశారంటూ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ మీడియాల్లోనూ రకరకాలుగా కథనాలు వెలువడుతున్నారు. ఈ తరుణంలో పూనమ్‌ ఇలాంటి కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె ట్వీట్‌లో ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినా చాలామంది వారికి అనుకూలంగా దాన్ని మార్చుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన పార్టీకి సంబంధించిన కొందరు పూనమ్‌ ట్వీట్‌ని విస్తృతంగా ప్రచారం చేస్తూ విషాన్ని కక్కే ప్రయత్నం చేస్తున్నారు. పూనమ్‌ ఈ పోస్ట్‌ పెట్టడం వెనుక ఉన్నది కూడా వారేననే వాదన కూడా వినిపిస్తోంది. మరి అసలు ఆమె ఏ ఉద్దేశ్యం తో చేసిందో తెలియాలి.

Read Also : Pawan Kalyan : ప్రజల కోసం టెంట్ కిందే కూర్చొని సమస్యలు విన్న జనసేనాని..

  Last Updated: 22 Jun 2024, 08:20 PM IST