సినీ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram )పై తాను ఫిర్యాదు చేసినట్లు నటి పూనమ్ కౌర్ (Poonam Kaur ) మరోసారి స్పష్టతనిచ్చారు. గతంలో చేసిన ఆరోపణలపై తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించిన ఆమె, “నేను త్రివిక్రమ్‌పై ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాను. ఇదే విషయం అప్పుడూ చెప్పాను, ఇప్పుడూ అదే చెబుతున్నాను” అని పేర్కొన్నారు. ఆమె చేసిన ఆరోపణలు, సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి.
ZP Office : జగన్ ఫోటో ఎందుకు ఉందంటూ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
గతంలో ఝాన్సీతో మాట్లాడినట్టు పూనమ్ పేర్కొంటూ.. ఝాన్సీ మాతో మీటింగ్ ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు మాట మార్చుతున్నారు. త్రివిక్రమ్‌ను రాజకీయ నాయకులు, ఇండస్ట్రీలోని పెద్దలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు” అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఆమె పేర్కొన్న విషయాల్లో తాను అనుభవించిన అన్యాయాన్ని ఆమె నిలదీయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఈ సందర్భంగా తాను ఫిర్యాదు చేసినందుకు సంబంధించిన ఆధారంగా ఒక స్క్రీన్‌షాట్‌ను కూడా పూనమ్ కౌర్ పంచుకున్నారు. ఈ స్క్రీన్‌షాట్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మరోసారి తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. త్రివిక్రమ్ అంశంపై పూనమ్ కౌర్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో అధికారికంగా స్పందన రావాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.