Site icon HashtagU Telugu

Poonam Kaur : పూనం కౌర్ కు ఆ వ్యాధి.. రెండేళ్లుగా నిద్రలేదు.. అందుకే అలా చేయాల్సి వస్తుంది..!

Poonam Kaur Guru Satire on Trivikram

Poonam Kaur Guru Satire on Trivikram

హీరోయిన్ పూనం కౌర్ (Poonam Kaur) కు ఒక భయంకరమైన వ్యాధి వచ్చిందట. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా పేజ్ లో పెట్టారు. 2022 ఆ టైం నుంచి ఆమె ఫైబ్రోమైయాల్జీయా అనే వ్యాధితో బాధపడిందట. రెండేళ్లుగా ఆమె ఈ వ్యాధితో బాధపడుతుందట. తీవ్రమైన వెన్ను నూపి రావడంతో ఆమె కేరళ ట్రీట్ మెంట్ కి వెళ్లారట. ఆ టైం లోనే తనకు వచ్చిన వ్యాధి గురించి తెలిసిందట. ఆమెకు ఫైబ్రో మయార్ల్జియా అనే వ్యాధి వచ్చిందట.

We’re now on WhatsApp : Click to Join

2022 నుంచి ఆమె ఈ వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకుంటుంది. కేరళలో ఒక ఆయుర్వేద హాస్పిటల్ లో ఆమె చికిత్స పొందుతున్నారు. ఇక పూనం లేటెస్ట్ గా ఈ వ్యాధి గురించి ప్రముఖ నేచురోపతి డాటర్ మంతెన సత్యనారాయణ రజుని కలిశారు. ఆయన్ను కలవడం ఎంతో ఆనదాన్ని ఇచ్చిందని.. ఫైబ్రో మైయాల్జియా కి ట్రీట్ మెంట్ కి సంబంధించి ఆయన ఎన్నో సూచనలు ఇచ్చారని ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

అంతేకాదు మంచి మనసు గల వ్యక్తితో కార్యక్రమంలో పాల్గొన్నందుకు.. ఈ వ్యాధి గురించి చర్చించే అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నానని రాసుకొచ్చారు పూనం కౌర్.

సినిమాల్లో కన్నా సోషల్ మీడియా పోస్ట్ లతో సంచలనంగా మారిన పూన కౌర్ ఛాన్స్ దొరికితే పవన్, త్రివిక్రం ల మీద పంచులు వేస్తూ ఉంటుంది. అయితే ఈమధ్యనే పూనం కౌర్ చిరు త్రివిక్రం ఫోటోకి హార్ట్ బ్రేక్ సింబల్ వేసి చాలా బాధగా ఉందని కామెంట్ చేసింది.