Poonam Kaur – Trivikram Srinivas : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీడియోకి స్పందిస్తూ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియా, మా అసోసియేషన్ వైఖరిని ప్రశ్నిస్తూ మహిళలపై వేధింపుల అంశాన్ని లేవనెత్తారు. ఈ పోస్ట్ నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.
తెలుగు ప్రేక్షకులకు నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన హీరోయిన్ ఈమె. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పూనమ్.. తన దృష్టికి వచ్చిన విషయాలపై నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. అప్పుడప్పుడు వైరాగ్యంతో, ఎవరినో ఒకరిని పరోక్షంగా టార్గెట్ చేస్తున్నట్లుగా పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు లేటెస్టుగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఉద్దేశిస్తూ పూనమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
పూనమ్ కౌర్ గతంలో గురూజీ అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు చేయడం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో సినీ అభిమానులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను గురూజీ అని పిలుస్తుంటారు కాబట్టి, ఆమె ట్వీట్స్ ఆయన్ని ఉద్దేశించే అని నెటిజన్లు భావిస్తుంటారు. అయితే ఇప్పుడు నేరుగా త్రివిక్రమ్ మాట్లాడిన ఓ వీడియోకి పూనమ్ రియాక్ట్ అయింది. ఆయన్ని అత్యంత దుర్మార్గుడిగా పేర్కొంది. అతన్ని సపోర్ట్ చేసే మీడియా వల్లే మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేసింది.
వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. స్రవంతి రవి కిషోర్ నిర్మాణంలో విజయ్ భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీనికి కథ మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత రవి కిషోర్ – త్రివిక్రమ్ కలిసి ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా “కొన్ని సినిమాలు డబ్బు, పేరు తీసుకొస్తాయి.. కానీ కొద్ది సినిమాలు మాత్రమే గౌరవాన్ని తీసుకొస్తాయి” అని తివిక్రమ్ అన్నారు.
కొన్ని సినిమాలు డబ్బు, పేరు తీసుకొస్తాయి.. కానీ కొద్ది సినిమాలు మాత్రమే గౌరవాన్ని తీసుకొస్తాయి ❤️
AN UNFILTERED CHIT CHAT Will be releasing Today 🤟🏻
The ‘Evergreen Classic’ #NuvvuNaakuNachav Grand Re-release on JAN 1st.
Book Your seats 🎟️https://t.co/WRF3MM7jr4
#Trivikram… pic.twitter.com/0CoygBySrG
— BA Raju’s Team (@baraju_SuperHit) December 30, 2025
విక్రమ్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ లను పలువురు ఫిలిం జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిపై పూనమ్ కౌర్ రియాక్ట్ అయ్యారు. “స్త్రీలను మానసిక క్షోభకు గురిచేసి, ఏమీ తెలియనట్టు తప్పించుకోగల అత్యంత దుర్మార్గపు వ్యక్తి అతను. మీలాంటి మీడియా అతనికి మద్దతు ఇవ్వడం వల్ల, అలాగే ‘మా’ (MAA) అసోసియేషన్ లాంటి వారు ఇలాంటి వారి బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించకపోవడం వల్లే ఇది సాధ్యమవుతోంది. కానీ సాధారణంగా వదిలేయాల్సిన ఒక చిన్న కామెంట్‌ను పట్టుకుని గొప్పగా షేర్ చేస్తున్నారు. మీలాంటి వారి వల్లే మహిళలపై వేధింపులు పెచ్చుమీరుతున్నాయి” అని పూనమ్ పోస్ట్ పేర్కొన్నారు.
ఇక్కడ ఆమె త్రివిక్రమ్ పేరు ప్రస్తావించనప్పటికీ, దర్శకుడు మాట్లాడిన వీడియో కింద స్పందించిన కాబట్టి, ఆయన్ని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
కొన్ని సినిమాలు డబ్బు, పేరు తీసుకొస్తాయి.. కానీ కొద్ది సినిమాలు మాత్రమే గౌరవాన్ని తీసుకొస్తాయి ❤️
AN UNFILTERED CHIT CHAT Will be releasing Today 🤟🏻
The ‘Evergreen Classic’ #NuvvuNaakuNachav Grand Re-release on JAN 1st.
Book Your seats 🎟️https://t.co/AnUMVHwv5k
#Trivikram… pic.twitter.com/6JkVcHNMIh
— L.VENUGOPAL🌞 (@venupro) December 30, 2025
