Site icon HashtagU Telugu

Poonam Kaur : ఆ ద‌ర్శ‌కుడు గ‌ర్భ‌వ‌తిని చేశాడంటూ పూనమ్ కౌర్ ట్వీట్

Poonam Kaur Guru Satire on Trivikram

Poonam Kaur Guru Satire on Trivikram

పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్ చేసి ఇండస్ట్రీ లో కాకరేపింది. పూనమ్ (Poonam Kaur) సినిమాలకన్నా సోషల్ మీడియా ద్వారా విపరీతమైన పాపులార్టీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. నిత్యం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), త్రివిక్రమ్ (Trivikram) ల ఫై ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. నిజంగా వారి వల్ల ఈమె ఎంత నష్టపోయిందో తెలియదు కానీ..బయట మాత్రం పూనమ్ కౌర్ కెరియర్ ను వీరిద్దరే నాశనం చేసారని మాత్రం ఓ వర్గం ప్రచారం చేస్తుంటుంది. ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా పూనమ్ సైతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లపై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేయడం , విమర్శలు , ఆరోపణలు చేయడం చేస్తుంటుంది. ఈ మధ్య అయితే డైరెక్ట్ గా త్రివిక్రమ్ పేరు పెట్టె విమర్శలు చేస్తుంది.

తాజాగా ఈమె చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇండ‌స్ట్రీలోని ఓ ద‌ర్శ‌కుడు ఒక అమ్మాయిని గ‌ర్భ‌వ‌తిని చేసి, ఆపై అబార్షన్ చేయించి ఆమె కెరీర్‌ను నాశ‌నం చేశాడ‌ని ఎక్స్ వేదికగా ఆరోపించింది. ‘మా’ జోక్యంతో ఆ పంజాబీ న‌టికి కాస్త స‌హాయం దొరికిందని పేర్కొంది. అత‌డు రాజకీయ నాయకుడిగా మారిన న‌టుడు కాద‌ని స్పష్టం చేసింది. అయితే, ఈ విష‌యంలోకి త‌న‌ను, ఆ నేత‌ను అన‌వ‌స‌రంగా లాగార‌ని పూనమ్ కౌర్ వాపోయింది. ఈ పోస్టులో పూన‌మ్ ఎవ‌రి పేర్ల‌నూ ప్రస్తావించకపోవడం తో వారు ఎవరై ఉంటారని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

Read Also : Train Accident : రైలు పట్టాలపై సిమెంటు దిమ్మెలు.. తప్పిన పెను ప్రమాదం