Poonam Kaur: పవన్ పై పూనమ్ సంచలన వ్యాఖ్యలు, ఫేక్ వాయిస్ వైరల్

పవన్ కల్యాణ్‌కు అమ్మాయిలతో ఉన్న సంబంధాలపై నటి పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలుగా చెప్తూ ఓ వాయిస్ రికార్డును వైసీపీ వర్గాలు షేర్ చేస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Punam

Punam

ముగ్గురు భార్యల వ్యవహారం, మహిళలతో సంబంధాల విషయంలో ఇతర ఆరోపణలను ముందుకు తెచ్చి పవన్ కళ్యాణ్  క్యారక్టర్ అసాసినేషన్‌కు వైసీపీ ట్రై చేస్తున్నట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా ఓ వాయిస్ రికార్డును సోషల్ మీడియాలో వైసీసీ వైరల్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

పవన్ కల్యాణ్‌కు అమ్మాయిలతో ఉన్న సంబంధాలపై నటి పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలుగా చెప్తూ ఓ వాయిస్ రికార్డును వైసీపీ వర్గాలు షేర్ చేస్తున్నాయి. దాంతో పాటు … ‘‘పవన్ కల్యాణ్‌కు చాలామంది అమ్మాయిలతో సంబంధాలున్నాయి. వాళ్లను అందరినీ మోసం చేశాడు. వాళ్లే కోపం వచ్చినప్పుడు వాడిని చంపొచ్చు. అంత కామమైన నీచమైన వ్యక్తి పవన్ కళ్యాణ్’ అని పూనమ్ కౌర్ అన్నట్లుగా ఓ వైసీపీ వర్గాలు షేర్ చేస్తున్నాయి.

‘నేను నోరు మూసుకున్నా పవన్‌ కళ్యాణ్‌ను చంపడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఆయన చాలామంది అమ్మాయిలతో తప్పు చేశారు. నా విషయంలో జరిగింది నేను ఫ్రూఫ్‌లు చూపిస్తే పవన్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు. నేను ప్రేమించాను కాబట్టి బయటకు రాలేదు. నాకు ఐ లవ్ యూ చెప్పి వేరే అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు. పవన్ వల్ల నా పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది’ అని పూనమ్ కౌర్ గొంతును పోలిన ఓ వాయిస్ రికార్డ్‌ను వైసీపీ అనుకూల వర్గాలు షేర్ చేస్తున్నాయి. అయితే.. ఈ వాయిస్ పూనమ్ కౌర్‌దా కాదా అనే విషయంలో స్పష్టత లేదు.

Also Read: BJP and BRS: ఈటెల, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య చర్చలు, తేల్చేసిన పువ్వాడ?

  Last Updated: 03 Jul 2023, 03:42 PM IST