Poonam on Pawan: అహంకారమా.. నిర్లక్ష్యమా? పవన్ మూవీపై పూనమ్ ఫైర్!

నటి పూనమ్ పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై కామెంట్స్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Poonam

Poonam

ప్రముఖ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur), నటుడు పవన్ కళ్యాణ్ మధ్య గత కొంతకాలంగా సోషల్ వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక పూనమ్ ఇటీవల తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తోంది. తాజాగా ఈ నటి  పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై కామెంట్స్ చేసింది. సినిమా పోస్టర్‌లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పేరును పవన్ పాదాల  కింద ఉంచడాన్ని ఆమె ట్విట్టర్ పోస్ట్ ద్వారా తప్పుపట్టింది

సమరయోధులను గౌరవించకపోయినా కనీస మర్యాద అయినా ఇవ్వాలి కానీ ఇలా కించపర్చకూడదు.. ఆయన పేరుని నీ కాలి కింద పెట్టుకుంటావా?.. ఇది అహంకారమా? లేక నిర్లక్ష్యమా? అంటూ పూనమ్ కౌర్ కామెంట్స్ చేయడం దుమారానికి దారి తీసింది. ఆమె తన విమర్శలో సినిమా (Pawan Kalyan) పేరును స్పష్టంగా చెప్పనప్పటికీ, ఆమె ఉస్తాద్ భగత్ సింగ్‌ను ప్రస్తావిస్తున్నట్లు చాలా మందికి స్పష్టంగా తెలుసు. ఇటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల విప్లవకారుడిని  అగౌరవ పర్చడమేనని కౌర్ వాదించారు.

అయితే పూనమ్ కౌర్ పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిందా? సినిమా పై హైప్ క్రియేట్ చేసేందుకు ఇలా వ్యవహరించిందా? నెటిజన్స్ పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూనమ్ కామెంట్స్ వైరల్ (Viral) కావడంతో.. పూనమ్ చాలా ఖాళీగా ఉందనీ, ఏమి చేయాలో తెలియక పవన్ పై విమర్శలు చేస్తుందని పీకే ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వెంటనే పవన్ కు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Teen Girl Suicide: ఫోన్ ఎక్కువగా వాడొద్దన్న తండ్రి, బిల్డింగ్ పైనుంచి దూకేసిన బిడ్డ!

  Last Updated: 11 May 2023, 04:25 PM IST