Poonam Kaur : పూనమ్ కౌర్ ‘గురు’ సెటైర్.. మళ్ళీ ఆయనే టార్గెట్..!

Poonam Kaur ఛాన్స్ దొరికితే చాలు డైరెక్టర్ త్రివిక్రం ని టార్గెట్ చేస్తూ హీరోయిన్ పూనం కౌర్ చేస్తూ ఉంటుంది. సందర్భం ఏదైనా సడెన్ గా ఒక ట్వీట్ వేసి సైలెంట్ గా నిప్పు రాజేస్తుంది అమ్మడు.

Published By: HashtagU Telugu Desk
Poonam Kaur Guru Satire on Trivikram

Poonam Kaur Guru Satire on Trivikram

Poonam Kaur ఛాన్స్ దొరికితే చాలు డైరెక్టర్ త్రివిక్రం ని టార్గెట్ చేస్తూ హీరోయిన్ పూనం కౌర్ చేస్తూ ఉంటుంది. సందర్భం ఏదైనా సడెన్ గా ఒక ట్వీట్ వేసి సైలెంట్ గా నిప్పు రాజేస్తుంది అమ్మడు. అంతకుముందు ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేసే పూనం కౌర్ ఈమధ్యనే వేస్ట్ ఫెలో అంటూ డైరెక్ట్ గా త్రివిక్రం పేరుని మెన్షన్ చేసింది. మళ్లీ లేటెస్ట్ గా ఇండస్ట్రీలో గురు అంటే అది దాసరి నారాయణ రావు గారే అని వేరే ఎవ్వరు కాదని అంటూ లేటెస్ట్ కామెంట్ చేసింది.

పూన కౌర్ లేటెస్ట్ గా నేను ఇంతకుముందే చెప్పాను మళ్లీ చెబుతున్నా సినీ పరిశ్రమలో గురువు అనే మాటకి నిలువెత్తు నిదర్శనం దాసరి నారాయణ రావు గారు మాత్రమే. ప్రతిభ గల వారిని ఆయన ఎంకరేజ్ చేశారు. ఇతరుల స్క్రిప్ట్ ను హైజాక్ చేసినట్టు ఈ పేరుని హైజాక్ చేయలేరు అని పూనం లేటెస్ట్ గా గురుజీ మీద సెటైర్ వేసింది.

ఇండస్ట్రీలో అందరు త్రివిక్రం ను గురూజీ అంటుంటారు. త్రివిక్రం కాదు అసలు గురుజీ దాసరి గారు అని.. స్క్రిప్ట్ లు హైజాక్ చేసినట్ట్టుగా ఆయన పేరుని హైజాక్ చేయలేరని లేటెస్ట్ కామెంట్స్ తో మరోసారి త్రివిక్రం మీద తన కోపాన్ని ప్రదర్శించింది పూనం కౌర్. ఈమధ్యనే జల్సా సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇవ్వకపోవడం వల్లే ఆమె త్రివిక్రం మీద ఇలా ఫైర్ అవుతుందని అనే కామెంట్స్ కు ఆమె క్లారిటీ ఇచ్చింది. అసలు జల్సా సినిమా లో తనకు అవకాశం ఇవ్వలేదని.. అది అసలు కారణం కాదని చెప్పింది.

త్రివిక్రం మీద పూనం ఫైర్ కు వెనుక రీజన్స్ ఏంటన్నది తెలియదు కానీ అమ్మడు ప్రతీసారి ఇలా తన కామెంట్స్ తో హాట్ టాపిక్ గా మారుతుంది. త్రివిక్రం మాత్రం ఆమె ఎలాంటి కామెంట్స్ చేసినా లైట్ తీసుకుంటున్నాడు.

  Last Updated: 17 Mar 2024, 12:45 PM IST