తెలుగులో స్వామి రారా(Swamy Rara) సినిమాతో మంచి పేరు తెచ్చుకొని అనంతరం పలు సినిమాల్లో నటించింది పూజా రామచంద్రన్(Pooja Ramachandran). తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది పూజా. నటిగా పూజా రామచంద్రన్ కి మంచి గుర్తింపు ఉంది. 2019 లో జాన్ కొక్కెన్(John Kokken) అనే నటుడ్ని పెళ్లి చేసింది పూజా. జాన్ కొక్కెన్ తెలుగు, తమిళ్ లో పలు సినిమాల్లో విలన్ గా నటిస్తున్నాడు.
పెళ్లి తర్వాత భర్తతో కలిసి బోలెడన్ని బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉంది పూజా. కొన్ని నెలల క్రితం తాను ప్రగ్నెంట్ అని తెలపడంతో అందరూ తనకు కంగ్రాట్స్ చెప్పారు. ఇటీవల భర్తతో కలిసి బీచ్ లో బేబీ బంప్ ఫోటోషూట్ కూడా చేసింది పూజా. తాజాగా నేడు పూజా రామచంద్రన్ పండంటి బాబు కు జన్మనిచ్చింది.
ఈ విషయం పూజా భర్త, నటుడు జాన్ కొక్కెన్ అధికారికంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పుట్టిన బాబు చేతిని పూజా, జాన్ పట్టుకొని ఫోటో తీసి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మా గుండెల్ని, జీవితాలను ఆనందంగా నింపడానికి మా బాబు వచ్చాడు. కియాన్ కొక్కెన్ కు ప్రపంచంలోకి స్వాగతం. మీ అందరి ప్రేమకు, ప్రార్థనలకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశాడు. దీంతో పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు పూజాకు, జాన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అప్పుడే కియాన్ అని పేరు కూడా పెట్టేశారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Dil Raju : నా కెరీర్ లో శాకుంతలం సినిమా పెద్ద షాక్ ఇచ్చింది..
