Site icon HashtagU Telugu

Pooja Hegde Upset: పూజా హెగ్డేను వెంటాడుతున్న ఫ్లాపులు.. బుట్టబొమ్మ ఖాతాలో ఐదో డిజాస్టర్!

Saman And Pooja, bollywood

Saman And Pooja

టాలీవుడ్ బుట్టబొమ్మ (Pooja Hegde) ఒకప్పుడు పట్టిందల్లా బంగారం. గతంలో వరుస హిట్స్ తో దూసుకుపోయిన పూజాహెగ్డే ఈ మధ్య వరుస ఫెయిల్యూర్ తో సతమతమవుతోంది. తాజాగా సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించిన కిసికి జాన్ కిసికా భాయ్ మూవీలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత మేర వసూళ్లు రాబట్టలేకపోయింది. సల్మాన్ పాత స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం, భారీ స్టార్ కాస్ట్ ఉన్నా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ మూవీ ఫలితంతో మరో డిజాస్టర్ పూజాహెగ్డే ఖాతాలో పడింది. అల వైకుంఠపురంలో సినిమాతో సక్సెస్ (Success) అందుకున్న ఈ బ్యూటీ. తరువాత ప్రభాస్ కి జోడీగా రాధేశ్యామ్ సినిమాలో నటించింది.

ఈ మూవీ డిజాస్టర్ (Failure) అయ్యింది. అయితే హిందీలో మళ్ళీ ఆమెకి అవకాశాలు రావడానికి ఈ సినిమా ఉపయోగపడింది. రాధేశ్యామ్ లో నటిగా తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కూడా మూవీ ఫ్లాప్ కావడంతో ఆమెని దురదృష్టం వెంటాడినట్లు అయ్యింది. ఇక రణవీర్ సింగ్ కి జోడీగా సర్కాస్ అనే సినిమాలో పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. యష్ రాజ్ ఫిలిమ్స్ కి భారీ నష్టాలు మిగిల్చింది. అలాగే విజయ్ తో చేసిన బీస్ట్ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. తమిళంలో మాత్రమే ఈ మూవీ పర్వాలేదనే టాక్ తెచుకుంది. ఇక రామ్ చరణ్ కి జోడీగా నటించిన ఆచార్య (Acharya) మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది.

ఇలా వరుసగా నాలుగు ఫ్లాప్ సినిమాలతో ఉన్న పూజా హెగ్డేకి తాజాగా సల్మాన్ ఖాన్ తో చేసిన కిసికి జాన్ కిసికా భాయ్ సినిమాతో మరో డిజాస్టర్ ఖాతాలో వచ్చి చేరింది. ఈ సినిమా ఓపెనింగ్స్ కేవలం 14 కోట్లు మాత్రమే వచ్చాయి. సల్మాన్ ఖాన్ సినిమాలో ఈ మధ్యకాలంలో తక్కువ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చిన మూవీ ఇదే కావడం విశేషం. మొత్తానికి పూజా హెగ్డే కెరియర్ ఆరంభంలో వరుసగా మూడు ఫ్లాప్ లతో ఐరన్ లెగ్ ముద్ర వేసుకోగా ఇప్పుడు వరుసగా ఐదు డిజాస్టర్స్ ను సొంతం చేసుకొని గోల్డెన్ లెగ్ కాస్త ఐరన్ లెగ్ గా మారింది (Pooja Hegde).

Also Read: Samantha Tattoo: చైతూను మరిచిపోలేకపోతున్న సమంత, ఒంటిపై మాజీ భర్త టాటూలు ప్రత్యక్షం!