స్టార్ హీరోయిన్ పూజా హగ్దే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు కు లీగల్ నోటీసులు పంపింది. గత కొద్దీ నెలలుగా ఉమర్ సంధు సోషల్ మీడియా లో రెచ్చిపోతున్నాడు. పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు రివ్యూ ల పేరుతో బాగున్నా సినిమాలను బాగాలేవని , ప్లాప్ చిత్రాలను బ్లాక్ బస్టర్ అని పోస్టులు పెడుతూ అభిమానుల్లో ఆగ్రహం తెప్పిస్తున్నాడు. అంతే కాదు పలువురు హీరో – హీరోయిన్లకు అక్రమ సంబంధాలు అంటకట్టి అనేక రూమర్స్ సృష్టిస్తున్నాడు.
తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ – పూజా హగ్దే (Salman Khan Pooja Hegde) లకు మధ్య ప్రేమ చిగురించిందని , అందుకే సల్మాన్ తన కొత్త సినిమాల్లో ఛాన్స్ ఇస్తున్నాడని ఆరోపించాడు. అంతే కాదు ఇటీవల ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందంటూ మరో ఆరోపణ చేశాడు. వరుస ప్లాప్స్ తో డీలా పడ్డ పూజా హెగ్డే తన నివాసంలో సూసైడ్ చేసుకోబోయింది. కుటుంబ సభ్యులు చూసి కాపాడారంటూ ట్వీట్ చేశారు. ఇలా వరుస తప్పుడు ఆరోపణలు చేస్తుండడం తో పూజా హగ్దే లీగల్ గా నోటీసులు జారీ చేసింది. సదరు నోటీసులను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఉమర్ సంధు పూజా హెగ్డేను హేళన చేశాడు. ఈ నోటీసులు తననేమీ చేయవని చెప్పుకొచ్చాడు.
ప్రభాస్ (Prabhas) తో బ్రేకప్ మేటర్ లీక్ చేసినందుకు నాకు కృతి సనన్ (Kriti Sanon) నోటీసులు ఇచ్ఛందని ట్వీట్ చేశాడు. ఎక్కడో దుబాయ్ లో ఉండే ఉమర్ సంధు ఇండియన్ చట్టాలు తనను ఏమీ చేయలేవని ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియా కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం ఈ నోటీసులు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
https://twitter.com/UmairSandu/status/1683900671945211923?s=20
Read Also : Ram Likes Baby: యంగ్ బ్యూటీకి రామ్ అదిరిపొయే గిఫ్ట్, ఆనందంలో బేబీ హీరోయిన్!