Site icon HashtagU Telugu

Sakshi Vaidya : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పూజాహెగ్డే అవుట్.. పూజా ప్లేస్ లో అఖిల్ ఏజెంట్ భామ..?

Pooja Hegde Replaced with Sakshi Vaidya in Ustaad Bhagat Singh Movie

Pooja Hegde Replaced with Sakshi Vaidya in Ustaad Bhagat Singh Movie

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసినా ఆయన రాజకీయాల బిజీ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ప్రోమో కోసం గతంలో ఒక షెడ్యూల్ షూట్ చేశారు. ఇక ఇటీవలే వారాహి యాత్ర పూర్తయ్యాక పవన్ ఉస్తాద్ షూట్ కి డేట్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ జరుగుతుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముందుగా పూజాహెగ్డే(Pooja Hegde), శ్రీలీల(Sreeleela) హీరోయిన్స్ గా అనుకున్నారు.

పూజా హెగ్డే ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకుంది. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి కూడా తప్పుకుందని వార్తలు వచ్చాయి. అయితే పూజా నిజంగానే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అఖిల్ ఏజెంట్ సినిమాలో నటించిన సాక్షి వైద్య పూజా హెగ్దే ప్లేస్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించబోతుందని సమాచారం.

వరుణ్ తేజ్ నటించిన గాండీవదారి అర్జున సినిమా రేపు ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో సాక్షి వైద్య పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంది అని చెప్పింది. దీంతో ఉస్తాద్ సినిమాలోనే పూజా ప్లేస్ లో సాక్షిని తీసుకున్నట్టు తెలుస్తుంది. రెండు సినిమాలతోనే సాక్షి ఏకంగా పవన్ సరసన ఛాన్స్ కొట్టేసింది. మరి పూజా ఎందుకు ఈ సినిమా నుంచి తప్పుకుందో కారణాలు బయటకి రాలేదు.

 

Also Read : Bedurulanka 2012 Premier Talk : బెదురులంక 2012 టాక్