Site icon HashtagU Telugu

Pooja Hegde: రాధే శ్యామ్’ సెట్స్‌లో ప్ర‌భాస్ అంద‌రికి భోజ‌నం పెట్టారు – న‌టి పూజా హెగ్దే

నటి పూజా హెగ్డే తన రాబోయే సినిమా ‘రాధే శ్యామ్’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ప్రభాస్‌తో కలిసి సినిమాకు పనిచేసిన అనుభవం గురించి నటి చెప్పింది. తాను ప్రేమలో ఉన్న పాత్రలో ప్రేరణగా నటించానని.. త‌న‌ పాత్రలో డిఫరెంట్ షేడ్స్, ఎమోషన్స్ ఉంటాయని ఆమె తెలిపారు. ప్రేరణ పాత్ర బహుళస్థాయి పాత్ర అని అన్నారు. టాప్ తెలుగు హీరోలతో పనిచేసిన అనుభవం గురించి ప్రశ్నించినప్పుడు, పూజా మాట్లాడుతూ, ఇప్పటివరకు వారు ఇచ్చిన రిసెప్షన్‌తో తాను మునిగిపోయానని చెప్పింది.

‘రాధే శ్యామ్’ షూటింగ్ సమయంలో, త‌మ బృందంలో చాలా మందికి కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని… వాళ్లందరికీ ప్ర‌భాస్ ఫుడ్ పంపిణీ చేశార‌ని ఆమె గుర్తు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు, పర్ఫెక్షనిస్ట్ అని ఆమె పేర్కోన్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ సింగిల్ టేక్‌లో ఎన్నో షాట్స్ ఓకే అయ్యాయని తెలిపారు. మరోవైపు, అల్లు అర్జున్ చాలా ఎనర్జీటిక్ గా ఉంటార‌ని తెలిపింది.
హీరో మ‌హేష్ బాబుతో త‌న‌కు ఒక ప్రాజెక్టు ఉందని… అది త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంద‌ని వెల్ల‌డించారు. ఇదికాక‌ మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి, వాటిని త్వరలో ప్రకటిస్తామని ఆమె తెలిపారు. పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేప‌థ్యంలో న‌టి పూజా హెగ్దే ప్ర‌మోష‌న్ చేస్తున్నారు.

Exit mobile version