Pooja Hegde: పాపం బుట్టబొమ్మ.. ఐటెం సాంగ్స్ కు రెడీ అంటున్న పూజాహెగ్డే?

రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌ సినిమాలు పూజాహెగ్డేకు వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చాయి.

Published By: HashtagU Telugu Desk
Pooja Hegde

Pooja Hegde

దువ్వాడ జగన్నాధం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో దూసుకుపోయిన బుట్టబొమ్మ (Pooja Hegde) ప్రస్తుతం అవకాశాలు లేకుండాపోయింది. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌ సినిమాలు పూజాహెగ్డేకు వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చాయి. సక్సెస్ రేటు తగ్గడంతో అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చేసినప్పటికీ హిట్ దక్కలేదు.

ఆమెకు ఇప్పటికీ బాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయి, గత కొన్ని నెలలుగా ఆమె ఏ తెలుగు సినిమాలకు సైన్ చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఆమె  మహేశ్ బాబు #SSMB28లో నటిస్తున్నప్పటికీ తాత్కాలిక బ్రేక్ పడింది. ఇక పూజకు సినిమా షెడ్యూల్‌లు ఏవీ లేకపోవడంతో పూజా కమర్షియల్ యాడ్స్ చేస్తూ సెలవులను అస్వాదిస్తోంది. అయితే ఈ బ్యూటీ ఓ ఐటెం సాంగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. సమంత ‘ఊ అంటావా మావా ఊ’ మాదిరిగా తాను కూడా అలాంటి ఐటెం పాట (Item Song)లో అందాలు ఆరబోయాలని ఫిక్స్ అయ్యిందట. అయితే ఈ విషయం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అవకాశాలు లేక సతమతమవుతున్న ఈ బ్యూటీ ఐటెం సాంగ్స్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Also Read: Viral Video: వీడు మాములోడు కాదు, తల్లిపైనే పోలీసులకు కంప్లైంట్ చేశాడు!

  Last Updated: 15 May 2023, 06:04 PM IST