Site icon HashtagU Telugu

Pooja Hegde : పూజా బేబీకి ఆ ఛాన్స్ అయినా ఉందా లేదా..?

Pooja Hegde about Surya Retro Movie Chance

Pooja Hegde about Surya Retro Movie Chance

Pooja Hegde మొన్నటిదాకా టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఒక్కసారిగా టాలీవుడ్ లో ఖాళీ అయిపోయింది. అమ్మడికి తెలుగు ఆఫర్లు ఒక్కటంటే ఒక్కటి రావట్లేదు. సూపర్ స్టార్ మహేష్ తో గుంటూరు కారం ఛాన్స్ వచ్చినా సరే సినిమా వాయిదాల మీద వాయిదాలు పడటం వల్ల వేరే పాజెక్ట్ లకు కమిట్ అవడం వల్ల పూజా హెగ్దే ఆ సినిమా నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది.

అలా చేతిలో ఉన్న ఒక్క సినిమా కూడా పోయే సరికి పూజా (Pooja Hegde) తెలుగులో ఖాళీ అయిపోయింది. రవితేజ, నాని సినిమాల్లో ఛాన్స్ అంటూ హడావిడి చేసినా అదేది నిజం కాదని తెలుస్తుంది. గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్సైనా ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు పూజా హెగ్దేని ఎంపిక చేశారని టాక్. సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్ లెక్కలో ఐటం సాంగ్ చేయాలని పూజా కూడా ఫిక్స్ అయ్యిందట.

Also Read : World Cup 2023: రోహిత్.. చూసుకోవాలి కదా

పూజా హెగ్దే గుంటూరు కారం (Guntur Karam) స్పెషల్ సాంగ్ చేస్తుందా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ గురించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాతో మహేష్ పాన్ ఇండియా రేసులో నిలబడతారని అంటున్నారు.

మహేష్ త్రివిక్రం (Trivikram) ఇద్దరు కలిసి ఇప్పటికే అతడు, ఖలేజా సినిమా చేశారు. హ్యాట్రిక్ సినిమాగా రాబోతున్న గుంటూరు కారం సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలో మహేష్ (Mahesh Babu) మాస్ లుక్స్ ఇప్పటికే ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

We’re now on WhatsApp. Click to Join