Site icon HashtagU Telugu

Pooja Hegde: జిగేల్ రాణి.. మళ్లీ వచ్చేస్తోంది!

Pooja

Pooja

నాలుగేళ్ల క్రితం.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ మూవీ భారీ హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చరణ్ కెరీర్ లో బెస్ట్ మూవీ నిలిచింది ఈ మూవీ. భాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లు సాధించింది. అయితే రంగస్థలం అనగానే.. చాలామందికి చిట్టిబాబుతో జిగేల్ రాణి గుర్తుకువస్తోంది. మొదటిసారి ఐటం సాంగ్ లో నటించిన పూజ తన హావభావాలు, మత్తెక్కించే స్టెప్పులతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికీ జిగేల్ రాణి పాట ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. లెటెస్ట్ సమాచారం ఏమిటంటే.. టాలీవుడ్ బ్యూటీ పూజాహెగ్డే మళ్లీ జిగేల్ రాణి లాంటి ఐటం సాంగ్ తో  మెప్పించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

అనిల్ రావిపుడి డైరెక్షన్ లో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఎఫ్-3 మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక్క సాంగ్ మినహా ఈ సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయ్యినట్టే. ఆ ఒక్క సాంగ్ ఐటం సాంగ్ అని తెలుస్తోంది. ఇందుకోసం పూజహెగ్డేను తీసుకున్నట్టు టాక్. ఈ మేరకు ఎఫ్3 మేకర్స్ ఓ హీరోయిన్ ఫొటోను రిలీజ్ చేశారు. ఆ ఫొటోను నిశితంగా గమనిస్తే.. పూజనే అని తెలుస్తోంది. చాన్నాళ్ల తర్వాత పూజ మరోసారి జిగేల్ రాణి ఐటం సాంగ్ కోసం సిద్దమవుతోంది. ఈ ప్రత్యేక పాట కోసం రెమ్యునరేషన్ బాగానే డిమాండ్ చేసిందని టాక్ కూడా వినిపిస్తోంది.