టాలీవుడ్‌లో గ్లామర్స్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే (Pooja Hegde) ఇప్పుడు ఓ విభిన్నమైన పాత్ర కోసం సిద్ధమవుతోందట. దశాబ్దం పైగా కెరీర్ కొనసాగించినప్పటికీ ఇప్పటివరకు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చాలా తక్కువ చేసింది ఈ భామ. ‘అరవింద సమేత’ వంటి కొన్ని సినిమాల్లో నటనకు చోటు దొరికినప్పటికీ ఆమె గ్లామర్‌నే ఎక్కువగా హైలైట్ చేశారు. ఇప్పటి వరకు తాను ఎంచుకున్న పాత్రలు స్టైలిష్, అట్రాక్టివ్ గ్లామర్ రోల్స్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు తొలిసారిగా డీగ్లామరస్ క్యారెక్టర్ చేయబోతోందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.
Ramya Krishna and Krishna Vamsi’s Divorce : రమ్యకృష్ణ కు విడాకులు క్లారిటీ ఇచ్చిన వంశీ
‘కాంఛన’ (Kanchana 4) సిరీస్ నాలుగో భాగాన్ని రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే ఎంపిక కావడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆమె పాత్ర గ్లామరస్ క్యారెక్టర్ కాదని, చెవిటి-మూగ అమ్మాయిగా కనిపించబోతోందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ‘కాంఛన 3’లో నిత్యా మీనన్‌ను కూడా దివ్యాంగురాలిగా చూపించారు. కానీ నిత్యా మీనన్ అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్న కారణంగా ఆ క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంది. కానీ పూజా హెగ్డేను అలాంటి చాలెంజింగ్ రోల్‌లో చూడటం అభిమానులకు అసహజంగా అనిపిస్తోంది.
UPI Lite : ‘యూపీఐ లైట్’ వాడుతున్నారా ? కొత్త ఆప్షన్ గురించి తెలుసుకోండి
పూజా ఇప్పటి వరకు మాస్, కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ షో చేసిన హీరోయిన్. అయితే ఇప్పుడు ఒక ఎమోషనల్, పెయిన్‌ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు వార్తలు వస్తుండటంతో ఆమె నిజంగా నటనలో మెప్పించగలరా? అనే ప్రశ్న ఎదురవుతోంది. పూజా హెగ్డే అభిమానులు ఈ క్యారెక్టర్‌కి ఆమె మిస్‌ఫిట్ అవుతుందేమో అని అనుమానపడుతున్నారు. కానీ ఈ పాత్ర ద్వారా తనలోని కొత్త కోణాన్ని చూపించే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఈ పాత్రను సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగితే, ఆమె కెరీర్‌లో మరొక మలుపు తిప్పే పాత్రగా మారే అవకాశముంది. ఏది ఏమైనా, పూజా హెగ్డే ఈ డీగ్లామరస్ క్యారెక్టర్‌లో ఎలా ఒదిగిపోతుందో చూడాల్సిందే!