Pooja Hegde : ఆఫర్లు లేకపోయినా తగ్గేదేలేదు అంటున్న పూజా హెగ్దే..!

Pooja Hegde బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో ప్రస్తుతం ఆఫర్లు లేకపోయినా తన డిమాండ్ మాత్రం ఏమి తగ్గలేదని తెలుస్తుంది. గుంటూరు కారం నుంచి సడెన్ గా ఎగ్జిట్

Published By: HashtagU Telugu Desk
Pooja Hegde Huge Demand for Naga Chaitanya movie

Pooja Hegde Huge Demand for Naga Chaitanya movie

Pooja Hegde బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో ప్రస్తుతం ఆఫర్లు లేకపోయినా తన డిమాండ్ మాత్రం ఏమి తగ్గలేదని తెలుస్తుంది. గుంటూరు కారం నుంచి సడెన్ గా ఎగ్జిట్ అయిన అమ్మడు ఆ సినిమా తర్వాత ఒక్క మూవీ ఛాన్స్ అందుకోలేదు. అటు బాలీవుడ్ లో కూడా పూజా పరిస్థితి ఏమి బాగాలేదు. హిందీలో షాహిద్ కపూర్ తో దేవా తప్ప మరో సినిమా లేదు.

తెలుగులో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నాగ చైతన్య సినిమా నుంచి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ అవకాశాన్ని వాడుకోవాలనే ఆలోచన పూజా హెగ్దేకి లేదన్నట్టు అర్ధమవుతుంది. సినిమాకు అమ్మడు 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ అడగడంతో నిర్మాతలు షాక్ అయినట్టు తెలుస్తుంది.

చైతు సినిమా ఒక లైలా కోసం తోనే పూజా హెగ్దే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరు కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. కానీ పూజా ఆఫర్ కన్నా రెమ్యునరేషనే ఎక్కువ అనేలా చేస్తుంది. ఇదే కాదు ఎన్.టి.ఆర్ దేవర సినిమాలో అమ్మడు ఒక స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్. అందుకు కూడా 2 కోట్ల దాకా డిమాండ్ చేస్తుందట పూజా.

మరి క్రేజ్ ఉన్నప్పుడు అంత అడిగితే కాదనకుండా ఇచ్చే వారు తెలుగులో అసలేమాత్రం ఛాన్సులు లేని టైంలో కూడా పూజా ఈ రేంజ్ లో పారితోషికం డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

  Last Updated: 30 Apr 2024, 12:37 AM IST