Site icon HashtagU Telugu

Pooja Hegde : వెడ్డింగ్ సీజన్ అంటూ వయ్యారాల వల.. రెడ్ డ్రెస్సులో పూజా పిచ్చెక్కించేస్తుందిగా..!

Pooja Hegde Latest Glamour Show

Pooja Hegde Latest Glamour Show

బుట్ట బొమ్మ పూజా హెగ్దే (Pooja Hegde) గ్లామర్ ట్రీట్ లో ఎప్పుడు ఒక అడుగు ముందుంటుంది. సినిమాల పరంగా టాలీవుడ్ లో దూకుడు తగ్గించినా సరే ఫోటో షూట్స్ తో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని అలరిస్తుంది ముగ్గురుమ్మ. ఇక లేటెస్ట్ గా రెడ్ కలర్ డ్రెస్సులో పూజా చేసిన ఈ ఫోటో షూట్ మరింత క్రేజీగా మారింది. రెడ్ కలర్ డ్రెస్ లో అమ్మడి వయ్యారాల ట్రీట్ ఓ రేంజ్ లో ఉంది. ముఖ్యంగా వెడ్డింగ్ సీజన్ అంటూ పూజా హెగ్దే పెట్టిన కామెంట్ స్పెషల్ గా మారింది.

గుంటూరు కారం సినిమాలో ముందు పూజా హెగ్దేనే హీరోయిన్ గా అనుకున్నా ఎందుకో సినిమా నుంచి బయటకు వెళ్లింది. ఆ సినిమా ఛాన్స్ మిస్ అయిన పూజా మరో తెలుగు సినిమా ఆఫర్ అందుకోలేదు. తనంతట తానే కాదంటుందా లేక మన దర్శక నిర్మాతలే ఆమెను కాదంటున్నారా అన్నది తెలియదు కానీ వరుస సినిమాలు చేసే అమ్మడి కెరీర్ కి సడెన్ బ్రేక్ పడింది.

ఇక సినిమాలతో ఎలగు రాలేకపోతున్న పూజా ఇలా ఫోటో షూట్స్ తో అలరించాలని చూస్తుంది. ఈమధ్య రవితేజ సినిమా నుంచి కూడా ఆమెనే హీరోయిన్ అని చెప్పుకుంటూ వచ్చి కొత్తగా వచ్చిన హీరోయిన్ ని తీసుకుని ఆమెకు హ్యాండ్ ఇచ్చారట. ఐతే ఇన్ని షాకులు తగులుతున్నా పూజా టాలీవుడ్ మీదే ఇంకా ఫోకస్ చేస్తుందని తెలుస్తుంది.

అందాక తన ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని అలరించే ప్రయత్నం చేస్తుంది. పూజా హెగ్దే చేస్తున్న ఈ గ్లామర్ షోకి కుర్రాళ్లంతా కూడా డిస్టర్బ్ అవుతున్నారు.