Site icon HashtagU Telugu

Pooja Hegde : మళ్ళీ సౌత్‌లో అవకాశాలు అందుకుంటున్న బుట్టబొమ్మ.. సూర్య సినిమాలో..!

Pooja Hegde Getting Actress Chance In Suriya Karthik Subbaraj Movie

Pooja Hegde Getting Actress Chance In Suriya Karthik Subbaraj Movie

Pooja Hegde : టాలీవుడ్ బుట్టబొమ్మగా తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూజా హెగ్డే.. ఆ మధ్య బాలీవుడ్ ఆఫర్స్ కోసం టాలీవుడ్ ని వదిలి వెళ్లిపోయింది. హిందీ సినిమాలకు డేట్స్ ఇవ్వడం కోసం.. మహేష్ బాబుతో చేస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాని కూడా వదిలేసారు. అయితే బాలీవుడ్ వెళ్లిన తర్వాత అక్కడ అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం పూజా బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో ‘దేవా’ అనే సినిమా మాత్రమే చేస్తున్నారు.

ఇక అక్కడ సరిగ్గా అవకాశాలు అందకపోవడంతో.. పూజా మళ్ళీ టాలీవుడ్ వైపు చూస్తుందట. ఈక్రమంలోనే సౌత్ లో పలు సినిమాల్లో నటించే అవకాశం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ బుట్టబొమ్మ తమిళ్ హీరో సూర్య సరసన నటించే ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య తన 44వ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పూజాని ఎంపిక చేసుకున్నారట చిత్ర యూనిట్. జూన్ నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది.

కాగా ఈ మూవీతో పాటు టాలీవుడ్ లో కూడా మరో రెండు సినిమాలకు పూజా ఎంపిక అయ్యినట్లు వార్తలు వస్తున్నాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ హీరోగా ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ గా సమంతని తీసుకోవాలని అనుకున్నారట. కానీ సామ్ రీ ఎంట్రీకి ఇంకా సమయం పడుతుందట. దీంతో ఆ ఆఫర్ పూజా వద్దకి వెళ్లిందట.

అలాగే నాగచైతన్యతో కలిసి మరోసారి నటించడానికి కూడా పూజా రెడీ అవుతున్నారట. గతంలో నాగచైతన్యతో కలిసి ‘ఒక లైలా కోసం’ వంటి హిట్ సినిమాలో పూజా నటించారు. ఇప్పుడు కార్తీక్ దండు దర్శకత్వంలో చైతన్య చేయబోయే మిస్టిక్ థ్రిల్లర్ సినిమాలో కూడా నటించే అవకాశం అందుకున్నారట. అయితే ఈ మూడు సినిమాలకు సంబంధించిన వార్తలు పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.