Site icon HashtagU Telugu

Pooja Hegde : పూజా ఎట్టకేలకు సాధించేసింది..!

Pooja Hegde about Surya Retro Movie Chance

Pooja Hegde about Surya Retro Movie Chance

Pooja Hegde బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఎట్టకేలకు ఒక భారీ ఆఫర్ అందుకుంది. రాధే శ్యాం తర్వాత సౌత్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేని పూజా హెగ్దే మహేష్ గుంటూరు కారంలో నటించాల్సి ఉన్నా ఛాన్స్ మిస్ చేసుకుంది. ఇదిలాఉంటే పూజా హెగ్దే తమిళ స్టార్ సూర్య తో జత కట్టబోతుంది. సూర్య నటిస్తున్న 44వ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేస్తున్నారు.

తమిళంలో విజయ్ సరసన బీస్ట్ సినిమాలో నటించింది పూజా హెగ్దే. ఆ తర్వాత కోలీవుడ్ లో కూడా అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు అమ్మడికి లక్కీ ఆఫర్ వచ్చింది. సూర్య సినిమాలో ఛాన్స్ అంటే అది అమ్మడికి వెరీ లక్కీ అని చెప్పొచ్చు. సౌత్ సినిమాల మీద ఆశగా ఉన్న పూజాకి ఇదొక గొప్ప ఛాన్స్ అని చెప్పొచ్చు.

సూర్య ప్రస్తుతం కంగువ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజు సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. కంగువ సినిమా శివ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో వస్తుంది. కంగువ రిలీజ్ కాగానే సూర్య 44వ సినిమాకు పూర్తి టైం కేటాయిస్తాడని తెలుస్తుంది. సూర్య సినిమాఓ కెరీర్ లో మళ్లీ బిజీ అవ్వాలని చూస్తుంది పూజా హెగ్దే.

Also Read : Allari Naresh Bacchala malli Business : అల్లరోడి సినిమకు సూపర్ బిజినెస్.. సినిమా పూర్తి కాకుండానే భారీ డీల్..!