Site icon HashtagU Telugu

Pooja Hegde : మాల్దీవ్స్ బీచ్‌లలో బర్త్ డేని బాగా ఎంజాయ్ చేసిన పూజాహెగ్డే..

Pooja Hegde Enjoying Birthday in Maldives

Pooja Hegde Enjoying Birthday in Maldives

మొన్నటిదాకా టాలీవుడ్(Tollywood) లో బిజీగా ఉన్న పూజాహెగ్డే(Pooja Hegde) ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. బాలీవుడ్(Bollywood) లో సినిమా ఆఫర్స్ వస్తున్నాయని అక్కడికి చెక్కేసి, డేట్స్ కుదరట్లేదు అని ఇక్కడ స్టార్ హీరోల సినిమాలు కూడా వదిలేసుకొని వెళ్లిపోవడంతో పూజా పాప ఒక్కసారిగా ఖాళీ అయింది. ప్రస్తుతం పూజాహెగ్డే చేతిలో ఒకటే బాలీవుడ్ సినిమా ఉండటం విశేషం.

సినిమాలు లేకపోయినా పూజా ఎంజాయిమెంట్ మాత్రం తగ్గట్లేదు. ఇటీవల పూజాహెగ్డే పుట్టిన రోజు కావడంతో ముందుగానే ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవ్స్(Maldives) కి చెక్కేసింది. అక్కడ మాల్దీవ్స్ బీచ్ లలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. బికినీలో తిరుగుతూ, సైకిల్ తొక్కుతూ హడావిడి చేస్తుంది. ఇక తన పుట్టిన రోజుని కూడా బీచ్ పక్కన ఉన్న ఓ రెస్టారెంట్ లో బికినీలో కూర్చొని కేక్ కట్ చేసింది.

మొత్తానికి తన పుట్టిన రోజుకి లాంగ్ వీకెండ్ తీసుకొని మాల్దీవ్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంది పూజాహెగ్డే. గతంలో పూజా మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు ఫుల్ గా రెచ్చిపోయి హాట్ ఫోటోలని షేర్ చేసింది. మరి ఈసారి కూడా హాట్ హాట్ ఫోటోలని ఇంకెన్ని షేర్ చేస్తుందో చూడాలి.

 

Also Read : Raviteja : బాలీవుడ్ షోలో చేతిపై బీర్ బాటిల్ పగలగొట్టుకున్న రవితేజ..