Site icon HashtagU Telugu

Pooja Hegde : పూజా హెగ్దేకి అన్యాయం చేస్తున్న టాలీవుడ్.. కారణం అదేనా..?

Pooja Hegde Huge Demand for Naga Chaitanya movie

Pooja Hegde Huge Demand for Naga Chaitanya movie

థై షో బ్యూటీ పూజా హెగ్దే (Pooja Hegde) తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టిన మొదటి రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. అయినా సరే అమ్మడిని సరిగా వాడుకోలేకనే ఆ ఫ్లాపులు పడ్డాయి తప్ప అమ్మడిలో టాలెంట్ ఉందని గుర్తించాడు డైరెక్టర్ హరీష్ శంకర్. అల్లు అర్జున్ తో చేసిన దువ్వాడ జగన్నాథం సినిమాలో పూజా హెగ్దేని సూపర్ గా వాడుకున్నారు. అంతకుముందు రెండు సినిమాలు గ్లామర్ సైడ్ అస్సలు చూపించని అమ్మడు డీజే కోసం గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. దాంతో తెలుగు ఆడియన్స్ అమ్మడి అందానికి ఫ్లాట్ అయ్యారు. డీజే యావరేజ్ గా ఆడినా పూజా బేబీకి వరుస అవకాశాలు వచ్చాయి.

We’re now on WhatsApp : Click to Join

వరుస స్టార్ సినిమాలతో పూజా హెగ్దే టాలీవుడ్ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ప్రతి సినిమాలో తన థై షోతో అమ్మడు ఆడియన్స్ ని మంత్ర ముగ్ధుల్ని చేసింది. పూజా హెగ్దే సినిమాలో ఉంటే గ్లామర్ సైడ్ ఆలోచించాల్సిన అవసరం లేదనిపించేలా అమ్మడి అందాలు ఉండేవి. దానికి తోడు పూజా ఉన్న సినిమాలన్నీ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, మహేష్, ప్రభాస్ ఇలా అందరితో సినిమాలు చేసిన పూజా హెగ్దే సడెన్ గా టాలీవుడ్ లో ఖాళీ అయిపోయింది. అమ్మడు సినిమా చేస్తానన్నా సరే ఒక్క అవకాశం ఇచ్చే వారు లేకుండాపోయారు.

మహేష్ గుంటూరు కారం లో మొదట హీరోయిన్ గా పూజా హెగ్దేనే అనుకున్నా కూడా ఎందుకో మళ్లీ ఆమె ప్లేస్ లో శ్రీ లీలని తీసుకున్నారు. ఆ తర్వాత రవితేజ, నాని సినిమాల్లో పూజా నటిస్తుందని టాక్ వచ్చినా కూడా అవేవి వాస్తవం కాదని తెలిసింది. పూజాని టాలీవుడ్ కావాలనే దూరం పెడుతుందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. కానీ ఆ అవసరం ఎవరికి ఉంటుంది. పూజాకి సరిపడే పాత్రలు రాకపోవడమో లేక ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వకపోవడమో తప్ప పూజా తెలుగులో సినిమాలు చేయకపోవడానికి వేరే కారణాలు ఏవి ఉండవు.

Also Read : Vaishnavi Chaitanya : బేబీ బ్యూటీకి అర కోటి ఇస్తున్నారా..?

మహేష్ సినిమా చేసుంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ గుంటూరు కారం నుంచి పూజా ఎగ్జిట్ అవ్వడం కూడా ఆమె కెరీర్ మీద ఇంపాక్ట్ పడేలా చేసింది. ఏది ఏమైనా బుట్ట బొమ్మ పూజా హెగ్దే తిరిగి ఫాం లోకి రావాలని తెలుగులో మళ్లీ వరుస సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. పూజాకి ఆ అవకాశం ఎవరు ఇస్తారన్నది చూడాలి. పూజా మాత్రం తెలుగులో చేసేందుకు ఎప్పుడు సిద్ధమే అనేలా ఉంది.