Pooja Hegde: తగ్గని పూజాహెగ్డే క్రేజ్.. షాపు ఓపెనింగ్ కు ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా!

అగ్ర కథానాయికలలో ఒకరైన పూజా హెగ్డే ఇప్పుడు తెలుగులో ఏ సినిమా చేయకపోయినా డిమాండ్ మాత్రం తగ్గలేదు.

Published By: HashtagU Telugu Desk
Pooja Hegde

Pooja Hegde

పూజా హెగ్డేకి ఇంకా డిమాండ్ తగ్గలేదు. ఆమె నిన్న కడపలో ఓ దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లింది. కేవలం కొన్ని గంటలే అక్కడ ఉన్నారు. ఆ కొన్ని గంటలకు ఆమె ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అగ్ర కథానాయికలలో ఒకరైన పూజా హెగ్డే ఇప్పుడు తెలుగులో ఏ సినిమా చేయకపోయినా డిమాండ్ మాత్రం తగ్గలేదు. అల్లు అర్జున్ సరసన ‘అల వైకుంఠపురం’ అలవైకుంఠపురంలో నటించిన పూజా హెగ్డే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి పూజా హెగ్డేకి మంచి విజయాన్ని అందించింది. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు ఆమెకు తెలుగు సినిమాలేవీ లేవు, అయితే మంచి కథతో సినిమా చేయాలని వెయిట్ చేస్తోంది.

అయితే పూజా హెగ్డేకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. నిన్న ఆమె కడపలో ఓ షాప్ ఓపెనింగ్ కి వెళ్లింది. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు, అభిమానులు తరలివచ్చారు. నిన్న కూడా శ్రావణ శుక్రవారం కావడంతో పూజా హెగ్డే వారి కోసం దుకాణం తెరిచారు. పూజా హెగ్డే కూడా చీర కట్టుకుని తనకు చీరలంటే ఎంత ఇష్టమో చెప్పింది. షాప్ ఓపెన్ చేయగానే సినిమాలోని పాటలకు డ్యాన్స్ కూడా చేసింది.

ఆ షాప్ ఓపెనింగ్ కి పూజా హెగ్డే తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. కేవలం గంట నుంచి రెండు గంటల వరకు ఉండటంతో అక్షరాలా రూ. 40 లక్షలు తీసుకుంది. అంటే ఆమె డిమాండ్ ఇంకా తగ్గలేదని తెలుస్తోంది. ఆచార్య, రాధేశ్యామ్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ కావడంతో బుట్టబొమ్మకు అవకాశాలు తగ్గాయని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సరైన హిట్ కోసం సినిమాలు అంగీకరించడం లేదు అని పూజా హెగ్డే భావన.

Also Read: Vijay Deverakonda: ఖుషి షూటింగ్ అనుభవాలు మధుర జ్ఞాపకంగా నిలిచిపోతాయి: విజయ్ దేవరకొండ

  Last Updated: 26 Aug 2023, 01:30 PM IST