బుట్ట బొమ్మ పూజా హెగ్దే (Pooja Hegde) ఈమధ్య కాస్త దూకుడు తగ్గించినట్టు కనిపిస్తుంది. మొన్నటిదాకా తెలుగులో స్టార్ సినిమాలతో అదరగొట్టేసిన అమ్మడు ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ లు లేక వెనకపడింది. అంతేకాదు హిందీలో కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. ఐతే వెయిట్ చేసిన అమ్మడు సడెన్ గా నాలుగైదు సినిమాల ఛాన్స్ లను అందుకుంది. కోలీవుడ్ (Kollywood) లో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తున్న పూజా హెగ్దే హిందీలో కూడా మరో రెండు లక్కీ ఛాన్స్ లు పట్టేసింది.
ఐతే కెరీర్ పై తాను చాలా సంతోషంగా ఉన్నానని అంటుంది పూజా హెగ్దే. అంతేకాదు కెరీర్ లో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని.. పాత్రలు చేయడం కాదు అందులో జీవించాలని అంటుంది పూజా హెగ్దే. ఐతే పూజా మొన్నటిదాకా గ్లామర్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపించగా ఇక మీదట గ్లామర్ కన్నా నటనా ప్రాధాన్యత ఉన్న పాత్ర చేయాలని అనుకుంటుంది.
ఏది ఏమైనా పూజా ఫ్యాన్స్ కి అమ్మడి వరుస సినిమాలు మంచి కిక్ ఇస్తున్నాయి. తెలుగులో సినిమాలు చేయట్లేదన్న దిగులు ఉన్నా ఇక్కడ సినిమాలు చేయాలని కోరుతున్నారు. అమ్మడు సినిమాలో ఉంటే గ్లామర్ (Pooja Hegde Glamour Show) పరంగా అదరగొట్టేస్తుంది. ఆ గ్లామర్ షో మిస్ అవుతున్న ఫ్యాన్స్ మళ్లీ పూజాని అలా చూడాలని కోరుతున్నారు. మరి పూజా ఫ్యాన్స్ కోరిక ఎప్పుడు తీరుస్తుందో చూడాలి. పూజ హెగ్దే మాత్రం ఇక మీదట కథల ఎంపికలో జాగ్రత్త వహించాలని చూస్తుంది. తప్పకుండా తనని ఇక మీదట కొత్తగా చూస్తారని హింట్ ఇస్తుంది అమ్మడు.