Pooja Hegde : కొత్త అందాలతో మెరిసిపోతున్న బుట్ట బొమ్మ..!

బాలీవుడ్ లో ఛాన్సులు అందుకుంటుంది అమ్మడు. ప్రస్తుతం హిందీలో ఒక సినిమా చేస్తున్న పూజా హెగ్దే ఈమధ్యనే సూర్య 44వ సినిమాలో ఛాన్స్

Published By: HashtagU Telugu Desk
Pooja Hegde Beautifull Looks At Ananth Radhika Marriage

Pooja Hegde Beautifull Looks At Ananth Radhika Marriage

బుట్ట బొమ్మ పూజా హెగ్దే (Butta Bomma Pooja Hegde) సినిమాల పరంగా కాస్త తెలుగు ఆడియన్స్ కు దూరమైనా తన ఫోటో షూట్స్ తో మాత్రం ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. అమ్మడు మొన్నటిదాకా స్టార్ హీరోలందరితో జత కట్టింది. ఆమె చేసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అవ్వడంతో తిరుగు లేదని అనిపించుకుంది. ఐతే ఒకటి రెండు ఫ్లాపులు పడగానే పూజాని తీసి పక్కన పెట్టేశారు. రాధే శ్యాం (Radheshyam) రిజల్ట్ పూజా హెగ్దే కెరీర్ మీద చాలా ఇంపాక్ట్ పడేలా చేసింది.

ఐతే సౌత్ నుంచి సినిమాలు రాకపోయినా బాలీవుడ్ లో ఛాన్సులు అందుకుంటుంది అమ్మడు. ప్రస్తుతం హిందీలో ఒక సినిమా చేస్తున్న పూజా హెగ్దే ఈమధ్యనే సూర్య 44వ సినిమాలో ఛాన్స్ అందుకుంది. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాతో కోలీవుడ్ (Kollywood) లో కూడా రాణించాలని చూస్తుంది పూజా హెగ్దే.

పూజా హెద్దే ఏం చేసినా సరే ఒక రేంజ్ లో ఉంటుంది. అందులో భాగంగానే అమ్మడు లేటెస్ట్ గా కొత్త ఫోటో షూట్ తో అలరిస్తుంది. రీసెంట్ గా జరిగిన అంబాని ఇంటి వేడుకల్లో పూజా తన లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. సరికొత్త అందాలతో బుట్ట బొమ్మ మెరిసిపోయింది. తనని ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేలా చేసుకుంది. అనంత్ రాధిక ల మ్యారేజ్ లో ఎంతోమంది సెలబ్రిటీస్ (Celebrities) అటెండ్ అవ్వగా ఎవరికి వారు తగ్గేదేలే అన్న రేంజ్ లో అందాలతో ఆకట్టుకున్నారు.

వారిలో పూజా హెగ్దే (Pooja Hegde) అయితే తన అవుట్ ఫిట్ తో అదరగొట్టేసింది. యెల్లో కలర్ డ్రెస్ లో పూజా నిజంగానే ఒక ఏంజెల్ అనిపిస్తుంది. సినిమాల విషయంలో కాస్త దూకుడు తగ్గిందనే కానీ అమ్మడు మాత్రం సోషల్ మీడియా లో మాత్రం ఒక రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుందని చెప్పొచ్చు.

  Last Updated: 14 Jul 2024, 07:18 PM IST