బుట్ట బొమ్మ పూజా హెగ్దే (Pooja Hegde) కి టాలీవుడ్ లో ఇంకా బ్యాడ్ లక్ కొనసాగుతుంది. రాధే శ్యాం తో అమ్మడు లక్కీ ఛాన్స్ అందుకున్నా ఆ సినిమా తెలుగులో పెద్దగా ఆడకపోయే సరికి ఆ తర్వాత ఛాన్సులు మందగించాయి. ఈ క్రమంలో మహేష్ తో గుంటూరు కారం లో అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యింది. ఆ సినిమాలో పూజా హెగ్దే కొన్ని సీన్స్ చేసినా కూడా డేట్స్ ఇష్యూ వల్ల సినిమా నుంచి ఎగ్జిట్ అయ్యింది.
పూజా హెగ్దే కి తెలుగులో ఛాన్స్ లు లేకపోయినా ఈమధ్యనే కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది. సూర్య 44లో ఛాన్స్ అందుకున్న ఈ అమ్మడు ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే దళపతి విజయ్ సినిమాలో కూడా అవకాశాన్ని పొందింది. హెచ్. వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయాలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు కూడా నటిస్తుంది.
కార్తీక్ దండు డైరెక్షన్ లో..
ఇక తెలుగులో నాగ చైతన్య (Naga Chaitanya) సరసన పూజా హెగ్దే ఛాన్స్ అందుకుందని అన్నారు. కార్తీక్ దండు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిన్నటిదాకా పూజా హెగ్దేనే హీరోయిన్ అని చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ మీనాక్షి చౌదరికి వెళ్లినట్టు తెలుస్తుంది. మీనాక్షి ఈమధ్య వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.
లక్కీ భాస్కర్ (Lucky Bhasker) తో సూపర్ హిట్ అందుకున్న అమ్మడు మరో రెండు రోజుల్లో Viswak Sen మెకానిక్ రాకీగా రాబోతుంది. విశ్వక్ సేన్ ఈ సినిమాపై చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. కచ్చితంగా ఈ సినిమా తో మీనాక్షికి మరో హిట్ దక్కేలా ఉంది. ఈలోగా పూజా హెగ్దేని అనుకున్న సినిమా ఛాన్స్ అమ్మడికి వచ్చినట్టు తెలుస్తుంది.
Also Read : AR Rahman & Saira Banu Divorce : విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు