Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో పెద్దగా ఛాన్సులు రాబట్టుకోవట్లేదు. రాధే శ్యాం తర్వాత గుంటూరు కారం ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అవ్వగా ఆ తర్వాత నుంచి ఒక్క ఆఫర్ రాలేదు. దానికి రీజన్స్ ఏంటన్నది తెలియదు కానీ పూజా హెగ్దేకి బాలీవుడ్ లో కూడా పెద్దగా కలిసి రావట్లేదని చెప్పొచ్చు. పూజా హెగ్దే లేటెస్ట్ గా షాహిద్ కపూర్ హీరోగా నటించిన దేవ సినిమాలో నటించింది.
రోషన్ ఆండ్రూస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపించట్లేదు. పూజా హెగ్దేకి బాలీవుడ్ లో ఉన్న ఏకైక ఆఫర్ అదే.. కానీ ఆ సినిమా రిజల్ట్ కూడా తేడా కొట్టేసింది. పూజా హెగ్దే బ్యాడ్ లక్ ఇంకా కొనసాగుతుంది అనిపించేలా ఈ సినిమా ఫలితం ఉంది.
పూజా హెగ్దే మొన్నటిదాకా స్టార్ సినిమాలతో అదరగొట్టేసింది. కానీ సడెన్ గా అమ్మడు ఎందుకో వెనకపడింది. ఇక చేస్తున్న సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వట్లేదు. అందుకే ఆమెను పక్కన పెట్టేస్తున్నారు మేకస్. షాహిద్ కపూర్ దేవా మీద పూజా హెగ్దే చాలా హోప్స్ పెట్టుకుంది. కానీ సినిమా మాత్రం కొన్ని యాక్షన్ సీన్స్ తప్ప పెద్దగా ఏమి లేదని ఆడియన్స్ తేల్చి చెప్పారు.
మరి తెలుగు నుంచి కూడా పూజా హెగ్దే ఏదైనా ఆఫర్ రాబడుతుందా లేదా అన్నది చూడాలి. పూజా హెగ్దే ఫ్యాన్స్ మాత్రం ఆమె తిరిగి తెలుగు సినిమాలు చేస్తే చూడాలని కోరుతున్నారు.