Pooja Hegde : విజయ్ లాస్ట్ సినిమా ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ.. అధికారికంగా అనౌన్స్..

విజయ్ చివరి సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్నట్టు ఇటీవల ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ అనౌన్స్ చేసింది

Published By: HashtagU Telugu Desk
Pooja Hegde as Heroine in Vijay Last Movie

Vijay Pooja Hegde

Pooja Hegde : తమిళ్ స్టార్ హీరో విజయ్(Vijay) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నాడు విజయ్. దీంతో సినిమాలు ఆపేస్తున్నాడు. పూర్తి రాజకీయాల్లోకి వెళ్లేముందు విజయ్ చివరి సినిమా ఇటీవలే ప్రకటించారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్ పై H వినోద్ దర్శకత్వంలో విజయ్ లాస్ట్ సినిమా తెరకెక్కనుంది. ఇది విజయ్ కు 69 వ సినిమా.

విజయ్ చివరి సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్నట్టు ఇటీవల ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ అనౌన్స్ చేసింది మూవీ యూనిట్. తాజాగా ఈ సినిమాలో విలన్, హీరోయిన్స్ ని అధికారికంగా ప్రకటించారు. విజయ్ చివరి సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నట్టు ప్రకటించారు. అలాగే ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించబోతున్నట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

కొన్ని రోజుల వరకు తెలుగు, బాలీవుడ్, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజాహెగ్దే ఇటీవల ఛాన్సులు లేక డల్ అయిపోయింది. ఇప్పుడు విజయ్ లాస్ట్ సినిమాతో సౌత్ లో మళ్ళీ పూజకు గ్రాండ్ కంబ్యాక్ వస్తుందని భావిస్తున్నారు. పూజ హెగ్డే ఆల్రెడీ విజయ్ బీస్ట్ సినిమాలో నటించి మెప్పించింది. దీంతో ఈ జంట మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. మరి విజయ్ లాస్ట్ సినిమా ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

 

Also Read : Varahi Declaration Book: తిరుమలలో పవన్ కళ్యాణ్ చేతిలో ఎర్ర బుక్, ఆ పుస్తకంలో ఏముంది?

  Last Updated: 02 Oct 2024, 03:59 PM IST