అందాల భామ పూజా హెగ్దే (Pooja Hegde ) కెరీర్ దాదాపు ముగిసినట్టే అని అనుకున్నారు. కానీ అమ్మడికి తెలుగులో అవకాశాలు రావట్లేదు కానీ తమిళ్ లో మాత్రం వరుస ఛాన్సులు వస్తున్నాయి. కోలీవుడ్ లో పూజా హెగ్దే క్రేజీ కాంబో సెట్ చేసుకుంటుంది. ఇప్పటికే అమ్మడి సూర్య 44 వ సినిమాలో ఛాన్స్ అందుకుంది. సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న ఈ సినిమాలో పూజా బేబీ హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే మరో స్టార్ ఛాన్స్ అందుకుంది.
దళపతి విజయ్ (Thalapathy Vijay) 69వ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఆల్రెడీ విజయ్ తో బీస్ట్ సినిమా చేసిన పూజా హెగ్దే ఇప్పుడు మళ్లీ కలిసి నటిస్తుంది. కోలీవుడ్ లో పూజాకి లక్ కలిసి వచ్చేలానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూజా హెగ్దే ఈ ఛాన్స్ ని పర్ఫెక్ట్ గా యుటిలైజ్ చేసుకోవాలని చూస్తుంది.
దళపతి సినిమాలో ఛాన్స్..
దళపతి సినిమాలో ఛాన్స్ అంటే టాప్ లీగ్ లో ఉన్నట్టే లెక్క. ఒకేసారి ఇద్దరు కోలీవుడ్ స్టార్ సినిమాలో ఛాన్స్ అందుకున్న పూజా హెగ్దే అక్కడ రేసులో ఉన్నట్టే అని చెప్పకనే చెబుతుంది. టాలీవుడ్ లో పెద్దగా ఛాన్సులు లేకపోయినా కోలీవుడ్ లో అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి.
సూర్య 44, విజయ్ 69 సినిమాలతో పూజా తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది. ఇదే కాదు తెలుగులో కూడా పూజా హెగ్దే ఒకటి రెండు సినిమాల్లో డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది.
Also Read : Pawan Kalyan OG : ఓజీ బిజినెస్.. పవర్ స్టార్ స్టామినా అంటే ఇదే..!