Pooja Hegde: తన సినిమాల ఫ్లాప్ లపై స్పందించిన పూజా హెగ్డే.. సినిమాలు ఫెయిల్ నేను కాదు అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం

  • Written By:
  • Publish Date - April 18, 2023 / 06:36 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని సంబంధం లేకుండా అన్ని భాషల్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా గడుపుతోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ హెగ్డే.. గతంలో తాను నటించిన సినిమాల ఫెయిల్యూర్స్‌ గురించి స్పందించింది. ఈ సందర్భంగా పూజ హెగ్డే మాట్లాడుతూ.. ఒక సినిమా వెనుక ఎంతోమంది శ్రమ ఉంటుంది. నేను నటించిన సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందకపోతే నటిగా నేను ఫెయిలైనట్లు కాదు.. నేను ఏ సినిమా అంగీకరించినా అందులో నా పాత్రకు న్యాయం చేయాలని వంద శాతం ప్రయత్నిస్తాను. ఒక నటిగా ఆ సినిమా కోసం ఏం చేయాలో అది కచ్చితంగా చేస్తాను. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు నన్ను అభిమానిస్తున్నారు.

నా నటనను ప్రశంసిస్తున్నారు. నేను భావోద్వేగ సన్నివేశాల్లో బాగా నటించగలనని చెబితే, మరికొందరు నా డ్యాన్స్‌ను పొగుడుతారు. అలాగే నేను నటించిన ప్రతి సినిమా నుంచి ఏదో ఓ కొత్త విషయం నేర్చుకుంటూనే ఉన్నాను. ఒక వ్యక్తిగా, నటిగా ఇప్పటి వరకూ నేను పనిచేసిన దర్శకులంతా నన్ను ఇష్టపడుతూనే ఉన్నారు అని తెలిపింది పూజా హెగ్డే. అలాగే తాను నటించిన సినిమాలు ఒకప్పుడు వరుసగా సూపర్ హిట్ గా నిలిచాయని, ఇప్పుడు రెండు సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన ఏమీ కాదు అని తెలిపింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పూజ హెగ్డే తెలుగులో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.