Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్దేకి అసలు కాలం కలిసి రావట్లేదు. తెలుగులో పెద్దగా ఛాన్స్ లు రాబట్టుకోలేని ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా పెద్దగా జోరు కొనసాగించట్లేదు. రీసెంట్ గా దేవా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూజాకి రిజల్ట్ మరో షాక్ ఇచ్చింది. ప్రస్తుతం సూర్య రెట్రో, దళపతి జన నాయగన్ సినిమాలో అమ్మడు నటిస్తుంది.
సూర్య రెట్రో సినిమాలో పూజా హెగ్దెకి కార్తీక్ సుబ్బరాజు ఆమె నటించిన రాధే శ్యామ్ సినిమా చూసి ఛాన్స్ ఇచ్చినట్టు చెప్పాడట. అదే విషయాన్ని పూజా హెగ్దే రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సూర్య రెట్రోలో ప్రేమికురాలిగా కనిపిస్తానని అన్నది. ఐతే ఈ సినిమాలో లుక్స్ తో ఆమె సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది.
సూర్య సినిమా మే 1న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పాటుగా దళపతి విజయ్ చివరి సినిమాలో కూడా పూజా హెగ్దే నటిస్తుంది. ఆల్రెడీ విజయ్ తో బీస్ట్ సినిమా చేసింది అమ్మడు. సో ఈ రెండు సినిమాలతో కోలీవుడ్ లో మళ్లీ బిజీ అవ్వాలని చూస్తుంది పూజా హెగ్దే. తెలుగులో గుంటూరు కారం నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి ఆమెకు అసలు ఛాన్స్ లు రావట్లేదు.
మరి పూజా హెగ్దే మాత్రం ఒక్క ఛాన్స్ ఇస్తే మళ్లీ తనని ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది. టాలీవుడ్ నుంచి పూజా హెగ్దేకి ఛాన్స్ లు వస్తాయని ఆమె కూడా ఆశలు వదులుకున్నట్టు ఉంది.