Pushpa Part 2: “పుష్ప-2” షురూ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విలక్షణ దర్శకుడు సుకుమార్ ఎక్కించిన పుష్ప ది రైజ్..

Published By: HashtagU Telugu Desk
Pushpa2f

Pushpa2f

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విలక్షణ దర్శకుడు సుకుమార్ ఎక్కించిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. 350 కోట్లకు పైగా వసూలు చేసి అల్లు అర్జున్ కెరీర్ అతిపెద్ద విజయంగా నిలిచింది ఈ సినిమా. సినిమా కంటే కూడా పుష్ప మేనియా ప్రపంచాన్ని ఊపేసింది. అందులోని డైలాగులు, మేనరిజమ్స్ ,పాటలు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనపై ప్రశంశల వర్షం కురిసింది. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా పుష్ప సంచలన విజయం సాధించింది.

కరోనా సమయంలో కూడా 100 కోట్లకు పైగా వసూలు చేసి.. అల్లు అర్జున్ అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది పుష్ప. మొదటి భాగం చూసి ఎంతోమంది సినీ ప్రముఖులు అల్లు అర్జున్, సుకుమార్ ప్రశంశల వర్షం కురిపించారు. ఇంతటి సంచలన విజయం సాధించిన ఈ సినిమా రెండో భాగం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. ఈ ఎదురు చూపులకు సమాధానం దొరికింది. తాజాగా పుష్ప సీక్వెల్ పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

  Last Updated: 23 Aug 2022, 11:04 AM IST