Site icon HashtagU Telugu

Ponniyin Selvan Collections: పొన్నియిన్ సెల్వన్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. కమల్, విజయ్ రికార్డులు బద్దలు!

Ponniyan Selvan

Ponniyan Selvan

మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. భారీ స్టార్ కాస్ట్ నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య నిన్న విడుదలైంది. కొన్ని చోట్లా మిక్స్ డ్ టాక్ వినిపిస్తే, మరికొన్ని చోట్లా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొదటిరోజున భారీ వసూళ్లు సాధించింది మణిరత్నం మూవీ. సుమారు 39 కోట్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓపెనింగ్ డే కలెక్షన్లలో పలు సినిమాల రికార్డులను బద్దలుకొట్టినట్టు తెలుస్తోంది. బీస్ట్, వాలిమై, విక్రమ్ కంటే ముందు రెండవ అత్యధికంగా నిలిచింది. ఓవరాల్‌గా, మణిరత్నం దర్శకత్వం వహించిన పీరియడ్ ఎపిక్ కోలీవుడ్ చరిత్రలో ఆరో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.

PS-I రూ. మొదటి రోజు తమిళనాడులో సుమారుగా 23-24 కోట్లు. కోలీవుడ్‌లోని ముగ్గురు పెద్ద హీరోలు నటించడంతో అత్యధిక ఓపెనర్‌గా నిలిచింది. కాగా విజయ్, అజిత్, రజనీ, విక్రమ్ (రూ. 21.70 కోట్లు) బెస్ట్‌గా నిలిచారు. అయితే బీస్ట్ (రూ. 66.80 కోట్లు) మొదటి వీకెండ్స్ లో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. రాష్ట్రంలో తొలి వారం కలెక్షన్లు రూ. 100 కోట్లు. ఆతర్వాత కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ మూవీ ‘బీస్ట్’ రికార్డులను అధిగమించిందని కోలీవుడ్ మీడియా పేర్కొంది. ఇంకో వారంరోజులు గడిస్తే పొన్నియిన్ సెల్వన్ పై రికార్డులను అధిగమించే అవకాశాలున్నాయి.

పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ డే కలెక్షన్లు ఇవే

తమిళనాడు – రూ. 23.50 కోట్లు

తెలుగు రాష్ట్రాలు – రూ. 5.50 కోట్లు

కర్ణాటక – రూ. 4 కోట్లు

కేరళ – రూ. 3.25 కోట్లు

నార్త్ ఇండియా- రూ. 2.75 కోట్లు

మొత్తం – రూ. 39 కోట్లు