PS 2 Collections : రెండు రోజుల్లోనే 100 కోట్లు.. PS 1 కంటే PS 2 చాలా బెటర్..

పొన్నియిన్ సెల్వన్ 2పై తమిళ్ లో భారీ అంచనాలు ఉన్నా వేరే భాషల్లో మాత్రం అంత హైప్ లేకుండానే రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయ్యాక ఇప్పుడు అన్నిచోట్లా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Ponniyin Selvan 2 movie collects 100 Crores in 2 days

Ponniyin Selvan 2 movie collects 100 Crores in 2 days

మణిరత్నం(Maniratnam) పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) పార్ట్ 1 అంతగా అలరించకపోయినా ఇప్పుడు వచ్చిన పార్ట్ 2 మాత్రం ప్రేక్షకులని మెప్పిస్తుంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత.. మెయిన్ లీడ్స్ లో భారీగా తెరకెక్కింది పొన్నియిన్ సెల్వన్. పార్ట్ 1 తమిళ్ లో హిట్ అయినా మిగిలిన భాషల్లో మాత్రం యావరేజ్ గా నిలిచింది. పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

పొన్నియిన్ సెల్వన్ 2పై తమిళ్ లో భారీ అంచనాలు ఉన్నా వేరే భాషల్లో మాత్రం అంత హైప్ లేకుండానే రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయ్యాక ఇప్పుడు అన్నిచోట్లా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. దీంతో ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ ఆశిస్తున్నారు. తాజాగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 మొదటి రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

పొన్నియిన్ సెల్వన్ 100 కోట్ల గ్రాస్ సాధించగా దాదాపు 50 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 120 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంది. పార్ట్ 1 లాగే దాదాపు 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఇక అమెరికాలో కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఇప్పటికే 3 మిలియన్ డాలర్స్ వసూళ్లు రాబట్టింది పొన్నియిన్ సెల్వన్ 2. మరి ఓవరాల్ గా పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ఎంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

 

Rajamouli : సినిమా తీయమని ఆనంద్ మహీంద్రా ట్వీట్.. అది కష్టం అన్న రాజమౌళి..

  Last Updated: 30 Apr 2023, 09:31 PM IST