Site icon HashtagU Telugu

Pawan Kalyan: చిత్ర ప‌రిశ్ర‌మ‌కు రాజ‌కీయాలను అంటించ‌కూడ‌దు.. ప‌వ‌న్ చుర‌కలు ఎవ‌రికీ?

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: టాలీవుడ్ చిత్ర పరిశ్ర‌మ‌కు రాజ‌కీయాల‌ను అంటించ‌కూడ‌ద‌ని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. రాజ‌మండ్రి వేదిక జ‌రిగిన గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్ ఈ మేర‌కు వ్యాఖ్య‌లు చేశారు. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు రాజ‌కీయాల‌కు అస‌లు సంబంధ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. గ‌తేడాది ఏపీలో జ‌రిగిన ఎన్నికల స‌మ‌యంలో కూట‌మికి చాలా మంది స్టార్ హీరోలు మ‌ద్ద‌తు తెల‌ప‌లేద‌ని ఆయ‌న అన్నారు. అయినాస‌రే వారి మీద కూట‌మి ప్ర‌భుత్వం క‌క్ష పెట్టుకోలేద‌ని స్పష్టం చేశారు.

టికెట్ల రేట్ల పెంపుకు కార‌ణం చెప్పిన ప‌వ‌న్‌

ప్ర‌తి హీరో సినిమాకు టికెట్ల రేట్ల పెంపు కామ‌న్ అని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ఈ రేట్ల పెంపు అనేది డిమాండ్ అండ్ స‌ప్లై అంశం మీద ఆధార‌ప‌డి ఉంటుంద‌ని అన్నారు. గేమ్ ఛేంజ‌ర్ లాంటి మూవీని మూడేళ్లు తీసిన సినిమాకి టికెట్ల రేట్లు పెంచడంలో త‌ప్పు లేద‌ని అన్నారు. ఏపీ ప్ర‌భుత్వం టాలీవుడ్‌కు ప్ర‌తి విష‌యంలో అండ‌గా నిలుస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. గ‌తంలో వివిధ పార్టీల‌కు చెందిన ఎన్టీఆర్‌, కృష్ణ గారు సినిమా విష‌యానికి వ‌స్తే క‌లిసిపోయేవార‌ని అన్నారు.

Also Read: Naga Chaitanya : తండేల్ నుంచి అదిరిపోయే సాంగ్..!

సినిమా వాళ్ల క‌ష్టాలు తెలిస్తే రాజ‌కీయ నాయ‌కులు మాట్లాడండి

సినిమాను రాజ‌కీయంగా వాడుకోవాల‌ని చూస్తే స‌హించేది లేద‌ని ప‌వ‌న్ అన్నారు. మాకు దండం పెట్ట‌లేద‌ని కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు తెగ ఫీలైపోయి కావాల‌ని దండాలు పెట్టించుకున్న రోజులు ఉన్నాయ‌ని జ‌గ‌న్‌ను ఉద్దేశించి కౌంట‌ర్ ఇచ్చారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్, కేటీఆర్‌లు పేర్లు ఎత్తకుండా విమ‌ర్శించిన‌ట్లు తెలుస్తోంది. సినిమా రంగాన్ని ఒక ఆహ్లాదం ఇచ్చే రంగంగానే చూడాల‌ని దాన్ని కాంట్ర‌వ‌ర్శీ చేయాల్సిన ప‌నిలేద‌ని అన్నారు. దిల్ రాజు చెప్పిన‌ట్లు టాలీవుడ్‌ను రాజ‌కీయాల్లోకి లాగి ఇబ్బందులు తెవొద్ద‌న్న మాట‌ను గుర్తు చేశారు.

సినిమా వాళ్ల గురించి మాట్లాడే ముందు వాళ్ల క‌ష్టాలు కూడా తెలియాల‌న్నారు. అప్పుడే సినిమా ఇండ‌స్ట్రీ గురించి రాజ‌కీయ నాయ‌కులు మాట్లాడితే బాగుంటుంద‌ని సూచించారు. అయితే ఇటీవ‌ల సీఎం రేవంత్‌తో ఇండ‌స్ట్రీ పెద్ద‌ల స‌మావేశం త‌ర్వాత బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ఎఫ్‌డీసీ చైర్మ‌న్ దిల్ రాజు సుదీర్ఘ లేఖ రాసి రాజ‌కీయాల‌ను టాలీవుడ్‌కు యాడ్ చేయొద్ద‌ని కోరారు. అయితే ప‌వ‌న్ మాట్లాడిన కొన్ని వ్యాఖ్య‌ల‌కు పరోక్షంగా తెలంగాణ సీఎం రేవంత్‌, అలాగే కేటీఆర్‌కు త‌గిలాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.