Polimera 2 : సత్యం రాజేశ్ మెయిన్ లీడ్ లో 2021లో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన మిస్టికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘మా ఊరి పొలిమేర’. చేతబడుల కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డా.అనిల్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసారు. బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీలో రిలీజయ్యి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఈ సూపర్ హిట్ సినిమాకి 2023లో సీక్వెల్ తీసుకు వచ్చారు. సుమారు మూడు కోట్లతో తెరకెక్కిన ఈ సీక్వెల్.. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది.
ఇప్పుడు ఈ కలెక్షన్స్ విషయంలోనే నిర్మాత కృష్ణ ప్రసాద్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. పొలిమేర 2 సినిమా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సుబ్బారెడ్డి, వంశీ అనే ఇద్దరు వ్యక్తులు తీసుకున్నారు. ఇక సినిమా రిలీజయ్యి భారీ కలెక్షన్స్ రాబట్టిన తరువాత.. ఆ డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాత షేర్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. నిర్మాత అడుగుతుంటే, బెదిరింపులకు గురి చేశారట. దీంతో నిర్మాత న్యాయం కోసం పోలీస్ వారిని ఆశ్రయించారు. తనకి న్యాయం చేయాలని పోలీస్ వారికీ కంప్లైంట్ పత్రాన్ని స్వయంగా అందించారు.
— devipriya (@sairaaj44) July 15, 2024
కాగా ఈ మూవీకి మూడో భాగాన్ని కూడా తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగం చివరిలో మూడో భాగానికి లీడ్ ఇస్తూ పలు సస్పెన్స్ పాయింట్స్ ని దర్శకుడు వదిలేసారు. దీంతో పొలిమేర 3 పై ఆడియన్స్ లో మంచి హైప్ నెలకుంది. ఇటీవలే ఈ మూడో భాగం స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యినట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి రెండు భాగాలు కంటే మూడో భాగం చాలా థ్రిల్లింగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మొదటి రెండు భాగాల్లో కనిపించిన ప్రధాన పాత్రలే ఈ మూడో భాగంలో కూడా కనిపించనున్నాయట.