Site icon HashtagU Telugu

Baby Movie Producer : బేబీ సినిమా నిర్మాతకి పోలీసులు నోటీసులు.. డ్రగ్స్ కేసు విషయానికి బేబీ సినిమాకు లింక్ పెట్టి..

Police sends notice to Baby Movie Producer for showing Drugs scenes in Movie

Police sends notice to Baby Movie Producer for showing Drugs scenes in Movie

తాజాగా మరోసారి హైదరాబాద్(Hyderabad) లో డ్రగ్స్ కేసు(Drugs Case) సంచలనంగా మారింది. ఇటీవల రైడ్ చేసి మరీ కొంతమంది డ్రగ్స్ వినియోగిస్తున్న వాళ్ళని పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ వినియోగంలో మరోసారి సినిమా వాళ్ళు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా డ్రగ్స్ కేసుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌(CP CV Anand) ప్రెస్ మీట్ పెట్టి బేబీ సినిమా గురించి మాట్లాడారు.

సీపీ CV ఆనంద్ మాట్లాడుతూ.. బేబీ సినిమాలో(Baby Movie) డ్రగ్స్ ఏ విధంగా ఉపయోగించాలని దృశ్యాలను చూపించారు. ఇలాంటి వాటిని దృశ్యాలను చేయవద్దని సినిమా రంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బేబీ సినిమా వాళ్లకు నోటీసులు ఇస్తాం. ఇప్పటి నుంచి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుంది. ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో మేము రైడ్ చేసినప్పుడు ఉన్న సన్నివేషాలు బేబీ సినిమాలో ఉన్నట్టే ఉన్నాయి. సినిమా చూసే నిందితులు ఆ విదంగా పార్టీ చేసుకుంటున్నారు. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు పెట్టి కనీసం హెచ్చరిక వెయ్యకుండా డైరెక్ట్ గా ప్లే చేసింది సినిమా యూనిట్. మళ్ళీ మేము హెచ్చరిస్తే హెచ్చరిక లైన్ వేసింది మూవీ యూనిట్. ఇప్పుడు బేబీ సినిమా ప్రొడ్యూసర్ కి నోటీసులు ఇస్తాము. ఇకపై అన్ని సినిమాలపై ఫోకస్ పెడతాం. ఇలాంటి సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదు అని తెలిపారు. అయితే దీనిపై బేబీ నిర్మాత SKN మాత్రం ఇంకా స్పందించలేదు.

 

Also Read : Jawan: పుష్ప మూవీని మూడు సార్లు చూశాను, షారుక్ ఇంట్రస్టింగ్ ట్వీట్!