సంక్రాంతికి విడుదలైన సినిమాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) మీద పైరసీ ఎఫెక్ట్ భారీగా పడిన సంగతి తెలిసిందే. సినిమాకు మిక్సిడ్ టాక్ రావడంతో షాక్ లో అభిమానులు, మేకర్స్ ఉండగా…సినిమా విడుదలైన కొద్దీ గంటల్లోనే HD ప్రింట్ తో సినిమా లీక్ అవ్వడం అందర్నీ మరింత షాక్ కు గురి చేసింది. ఇదే క్రమంలో ఏపీలో ఏపీ లోకల్ టీవీలో ఆ ప్రింట్ టెలికాస్ట్ చేయడం మెగా అభిమానులకు, సామాన్యులకు షాక్ ఇచ్చింది. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పైరసీ ని అరికట్టాలని కోరారు. దీనిపై నిర్మాతలు సైతం పోలీసులకు ఫిర్యాదు చేసారు.
Pune : బస్సును ఢీకొన్న మినీ వ్యాన్..9 మంది మృతి
‘గేమ్ చేంజర్’ పైరసీ ప్రింట్ టెలికాస్ట్ చేసిన ఏపీ లోకల్ టీవీ సిబ్బంది మీద కంప్లైంట్ చేయడం తో పోలీసులు కేసు రిజిస్టర్ చేసిఎఫ్ఐఆర్ (22/2025) నమోదు చేశారు. విశాఖపట్నం కమిషనర్ ఆధ్వర్యంలో గాజువాక పోలీసులు, క్రైమ్ క్లూస్ టీం కలిసి ఏపీ లోకల్ టీవీ కార్యాలయానికి వెళ్లి, మూవీ పైరసీ ప్రింట్ టెలికాస్ట్ చేసిన అప్పల రాజును అరెస్టు చేశారు. M/S కాఫీ రైట్ సేఫ్టీ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.వి. చలపతి రాజు నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది.
శంకర్ – రామ్ చరణ్ – దిల్ రాజు కలయికలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, మొదట ఆట తోనే ప్లాప్ టాక్ మూటకట్టుకుంది. దీంతో పాటు విడుదలైన డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్ష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు చిత్రాలు వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాయి.