ప్రముఖ నటుడు అల్లు అర్జున్(Allu Arjun)కు చిక్కడపల్లి పోలీసులు(Chikkadapally Police) మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషాదకర ఘటన తెలిసిందే. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. తొక్కిసలాటకు కారణాలపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్‌ను పోలీసులు ఏ11గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్ట్ లో హాజరుపరచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. వెంటనే దీనిపై హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ రావడం తో అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చారు.కానీ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.
ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసి, రేపు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. ఈ విచారణ సందర్భంగా పోలీసులు మరిన్ని వివరాలు సేకరించబోతున్నట్లు సమాచారం. విచారణ ప్రక్రియలో నిర్మాతలు, ఇతర చిత్రబృందం సభ్యులను కూడా పిలిచే అవకాశం ఉంది. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కేసు ఫలితం ఎలా ఉంటుందో అన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. సంఘటన బాధిత కుటుంబాలకు న్యాయం చేసే విధంగా విచారణను కొనసాగించాలని పలువురు కోరుతున్నారు.
Read Also : BC-Welfare : నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు : సీఎం చంద్రబాబు